కోదండ‌రాంకు కొత్త స‌మ‌స్య‌...అస‌లు చిక్కు ఇదే

కోదండ‌రాంకు కొత్త స‌మ‌స్య‌...అస‌లు చిక్కు ఇదే

తెలంగాణ జనసమితి పార్టీ అధ్య‌క్షుడు ప్రొఫెస‌ర్ కోదండ‌రాంకు ముంద‌స్తు ఎన్నిక‌లు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నాయి. ఓవైపు మ‌హాకూట‌మికి పెద్ద‌న్న‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్ప‌టికే సీట్ల విష‌యంలో, అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల విష‌యంలో ముప్పుతిప్ప‌లు పెట్టిన సంగ‌తి తెలిసిందే. దీనికి కొన‌సాగింపుగా ఆయ‌న‌కు గుర్తు స‌మ‌స్య ఎదురైంది. ఈ మధ్యే అగ్గిపెట్ట గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. కానీ ఆ గుర్తు ప్రజల్లోకి ఇంకా వెళ్లలేదని స‌త‌మ‌తం అవుతుండ‌గా, మ‌రో రూపంలో ఆయ‌న‌కు స‌మ‌స్య ఎదురైంది. అదే స్వ‌తంత్రులు అనేక‌మంది అగ్గిపెట్టె గుర్తును ఎంచుకోవ‌డం.

టీజేఎస్‌కు ఎన్నికల సంఘం అగ్గిపెట్టె గుర్తు కేటాయించిన విషయం తెలిసిందే. అయితే, ఈ గుర్తు వ‌చ్చిన స‌మ‌యంలోనే కోదండ‌రాం టీంలో క‌ల‌వ‌రం మొద‌లైంది. దాదాపుగా 25 రోజులు మాత్ర‌మే ఉన్న ప్ర‌చార స‌మ‌యంలో ఎలా జ‌నాల్లోకి తీసుకువెళ్ల‌గ‌ల‌మ‌ని కాంగ్రెస్ నేత‌లు భావించి  అగ్గిపెట్టె గుర్తుతో రిస్క్ చేయడం ఎందుకని కోదండ‌రాంను ప్ర‌శ్నిస్తున్న కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో తెలంగాణ జనసమితి అభ్యర్థులు కాంగ్రెస్ గుర్తుపైనే పోటీ చేయాల‌ని ఒత్తిడి చేశారు. ఓట‌ర్లు అగ్గిపెట్టె గుర్తును గుర్తుప‌ట్ట‌క‌పోయి కారు గుర్తును వెంట‌నే గుర్తుప‌డితే టీఆర్ఎస్‌కు మేలు జ‌రుగుతుంద‌ని హ‌స్తం పార్టీ నేత‌లు ఆందోళ‌న చెంది ఈ ష‌ర‌తు విధించారు. అయితే, వారికి ఎలాగోలా స‌ర్దిచెప్పిన ప్రొఫెస‌ర్ అగ్గిపెట్టె గుర్తుతో బ‌రిలో దించారు.

అయితే, ప్రొఫెస‌ర్ కోదండ‌రాంకు ఇప్పుడు కొత్త స‌మ‌స్య వ‌చ్చిప‌డింది. కోదండ‌రాంకు అధికారికంగా ద‌క్కిన అగ్గిపెట్టె గుర్తునే ప‌లువురు స్వ‌తంత్ర్య అభ్య‌ర్థులు పొందారు. దీంతో ఈవీఎంలో వారికి ద‌క్కిన గుర్తు, టీజేఎస్‌కు ద‌క్కిన గుర్తు ఒక్క‌టే కావ‌డంతో త‌మ ఓట్ల‌కు గండిప‌డుతుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఓవైపు త‌మకు టికెట్లు ద‌క్కిన చోట కాంగ్రెస్ బ‌రిలో దిగ‌డం, మ‌రోవైపు ఇలా గుర్తు స‌మ‌స్య వ‌చ్చిప‌డ‌టంతో టీజేఎస్ శిబిరంలో క‌ల‌వ‌రం మొద‌లైంద‌ని అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English