టీఆరెస్ మహిళా అభ్యర్థి నామినేషన్ చెల్లుతుందా చెల్లదా?

టీఆరెస్ మహిళా అభ్యర్థి నామినేషన్ చెల్లుతుందా చెల్లదా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల దాఖలు గడువు ఇప్పటికే ముగిసింది. అయితే.. టీఆరెస్ అభ్యర్థి ఒకరు దాఖలు చేసిన నామినేషన్‌పై ఇప్పుడు చర్చ జరుగుతోంది. నామినేషన్ పత్రాల్లో ఒక కాలమ్ నింపకపోవడంతో ఆమె నామినేషన్ చెల్లుబాటు కాకపోవచ్చన్న ఊహాగానాలు మొదలయ్యాయి. నామినేషన్ల పరిశీలన తరువాత ఆమె అభ్యర్థిత్వం ఏమవుతుందో అని టీఆరెస్‌లో గుబులు మొదలైంది.

నిర్మల్ జిల్లా ఖానాపూర్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి రేఖానాయక్ నామినేషన్‌పై ఈ రగడ మొదలైంది. రేఖా నాయక్ దాఖలు చేసిన మూడు సెట్లలోనూ ఒక కాలాన్ని ఖాళీగానే ఉంచారు. ఉద్దూరుకి చెందిన రితేష్ రాథోడ్ అనే వ్యక్తి రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనికి స్పందించిన రిటర్నింగ్ అధికారి కలెక్టర్ కు అప్పీల్ చేశారు.

లెక్క ప్రకారం సరిగా పూర్తిచేయని నామినేషన్లను రిజెక్టు చేయాలి. ఇప్పుడు ప్రతిపక్షాలు, అక్కడి ఇతర పార్టీల అభ్యర్థులూ అదే డిమాండ్ చేస్తున్నారు. మూడు సెట్లలోనూ రేఖా నాయక్ ఖాళీలు పూరించలేదని తెలుస్తోంది. అయితే.. రేఖానాయక్ తరఫువారు మాత్రం ఆమె నామినేషన్ పత్రాలన్నీ పూరించారని చెబుతున్నారు.

ఖానాపూర్ టీఆరెస్ టిక్కెట్ కోసం సిటింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్.. రమేశ్ రాథోడ్‌లు పోటీ పడ్డారు. టిడిపి కీలక నేత రమేష్ రాథోడ్ ఖానాపూర్ ఎమ్మెల్యే టికెట్ కోసమే సంవత్సరం కింద టిఆర్ఎస్ లో చేరారు. కానీ, రమేశ్ రాథోడ్‌కు టిక్కెట్ రాకపోవడంతో ఆయన కాంగ్రెస్‌లో చేరి టిక్కెట్ దక్కించుకున్నారు. తాజా పరిణామాలతో టీఆరెస్‌కు ఒక సీటు పోయిందన్న ప్రచారం అప్పుడే మొదలైంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English