జ‌గ‌న్‌కు షాకిచ్చిన కొడాలి నాని!

జ‌గ‌న్‌కు షాకిచ్చిన కొడాలి నాని!

తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో కూక‌ట్‌ప‌ల్లి టీడీపీ అభ్య‌ర్థిగా నంద‌మూరి సుహాసినిని నిల‌బెడుతూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం చంద్ర‌బాబు నాయుడు తీసుకున్న నిర్ణ‌యం ఇప్ప‌డు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్‌కు కూడా త‌ల‌నొప్పిగా మారిన‌ట్లు తెలుస్తోంది. వైసీపీలో కీల‌కంగా ఉన్న ఓ నేత సుహాసిని త‌ర‌ఫున కూక‌ట్‌ప‌ల్లిలో ప్ర‌చారానికి సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో ఆ నాయ‌కుడికి స‌ర్దిచెప్ప‌లేక జ‌గ‌న్ త‌ల ప‌ట్టుకుంటున్న‌ట్లు స‌మాచారం.

గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ముక్కుసూటి మ‌నిషి. తాను ఏం అనుకుంటే అది చేస్తాడు. కృష్ణా జిల్లాలో వైసీపీ కీల‌క నేత‌ల్లో ఆయ‌న ఒక‌రు. చంద్ర‌బాబు అన్నా.. టీడీపీ అన్నా నానికి అస‌లే గిట్ట‌దు. కానీ జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో ఆయ‌న‌కు అత్యంత స‌న్నిహిత సంబంధాలున్నాయి. జూనియ‌ర్ ఎన్టీఆర్ తండ్రి దివంగ‌త హ‌రికృష్ణ‌తోనూ నాని చాలా ఆత్మీయంగా ఉండేవారు. వైసీపీ-టీడీపీల మ‌ధ్య బ‌ద్ధ శ‌త్రుత్వం ఉన్నా.. హ‌రికృష్ణ కుటుంబంతో స్నేహాన్ని మాత్రం నాని వ‌దులుకోలేదు.

తాజాగా కూక‌ట్‌ప‌ల్లిలో ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా హ‌రికృష్ణ కుమార్తె సుహాసిని బ‌రిలో దిగ‌డంతో ఆమె త‌ర‌ఫున ప్ర‌చారం చేయాల‌ని కొడాలి నాని భావిస్తున్నార‌ట‌. సుహాసినిని నాని త‌న‌ సొంతింటి ఆడ‌బిడ్డ‌లాగే ఆయ‌న ప‌రిగ‌ణిస్తుంటారు. కాబ‌ట్టి ఆమె గెలుపు కోసం త‌ప్ప‌కుండా త‌న‌వంతు కృషి చేయాల‌ని యోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అనుకున్న‌దే త‌డ‌వుగా జ‌గ‌న్‌కు ఫోన్ చేసిన నాని.. సుహాసిని త‌ర‌ఫున ప్ర‌చారానికి సంబంధించి త‌న మ‌న‌సులోని మాట‌ను నేరుగా చెప్పేశార‌ట‌.

నాని మాట‌ల‌తో జ‌గ‌న్ ఒక్క‌సారిగా నిశ్చేష్టుడ‌య్యార‌ని తెలుస్తోంది. తాను వ‌ద్ద‌న్నా నాని వింటాడో లేదోనని అనుమానించిన జ‌గ‌న్‌.. ప్ర‌స్తుతానికి విష‌యాన్ని ప‌క్క‌న‌పెట్టాయ‌ల‌ని భావించార‌ట‌. అందుకే తాను కొంచెం బిజీగా ఉన్నాన‌ని.. ఈ విష‌యంపై త‌ర్వాత మాట్లాడ‌తాన‌ని చెప్పి ఫోన్ పెట్టేశార‌ట‌. నాని చెప్పిన విష‌యంపై జ‌గ‌న్ ఎలా స్పందిస్తారోన‌న్న‌ది ఇప్పుడు స‌ర్వ‌త్రా ఆస‌క్తి రేకెత్తిస్తోంది. సుహాసిని త‌ర‌ఫున‌ ప్ర‌చారానికి నానిని అనుమ‌తిస్తే వైసీపీలో అంత‌ర్గ‌తంగా లుక‌లుక‌లు మొదల‌య్యేందుకు బ‌ల‌మైన అవ‌కాశాలున్నాయి. వ‌ద్ద‌ని చెప్తే నాని ఊరుకునే ర‌కం కాదు. దీంతో ఏం చేయాలో తెలియ‌క జ‌గ‌న్ త‌ల ప‌ట్టుకుంటున్న‌ట్లు తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English