కోహ్లీ తండ్రి కాబోతున్నాడా?

కోహ్లీ తండ్రి కాబోతున్నాడా?

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తండ్రి కాబోతున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆయన భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మకు చెందిన కొన్ని ఫొటోలను అందుకు ఆధారంగా చూపుతున్నారు. అయితే.. ఇప్పటివరకు కోహ్లీ వైపు నుంచి కానీ, అనుష్క కానీ దీనిపై పెదవి విప్పలేదు.

ముదురు నీలం రంగులో భారీ భారీ డిజైన్లతో ఉన్న గౌనులో వస్తున్న అనుష్క చిత్రం ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ ఫొటో చూసినవారంతా అనుష్క కచ్చితంగా ప్రెగ్నెంట్ అని అంచనా వేస్తున్నారు. పైగా కోహ్లీకి చిన్నపిల్లలంటే ఉన్న ఇష్టం.. ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు గుర్తు చేస్తూ కోహ్లీ కచ్చితంగా తండ్రి కాబోతున్నాడంటున్నారు ఆయన అభిమానులు. ఒక పాపాయి పొందడం కంటే ప్రపంచంలో గొప్ప ఆనందం ఏముంటుంది అని కోహ్లీ గతంలో ఓ సందర్భంలో చెప్పాడు.

అంతేకాదు... శిఖర్ ధావన్ కొడుకు జోరావర్, ధోనీ కూతురు జివా, రైనా కూతురు గ్రేసియాలతో కోహ్లీ ఖాళీ దొరికినప్పుడంతా ఆడుకుంటాడట. ఆ ముగ్గురు చిన్నారులతో కోహ్లీది ప్రత్యేక అనుబంధం అని చెబుతారు. అందువల్ల కోహ్లీ కూడా ఓ పాపనో బాబునో కనాలని అనుకుని ఉండొచ్చంటున్నారు.

చాలాకాలం ప్రేమలో ఉన్న కోహ్లీ, అనుష్కలు 2017 డిసెంబరులో పెళ్లి చేసుకున్నారు. వారి పెళ్లికి ముందు కూడా అభిమానుల్లో వారిపై ఎంతో ఆసక్తి ఉండేది ఇప్పుడు ఈ విషయం తెలియడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోహ్లీ అభిమానులు కన్ఫర్మేషన్ కోసం ఎదురుచూస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English