బండ్ల గణేష్ పంచులు మామూలుగా లేవు

బండ్ల గణేష్ పంచులు మామూలుగా లేవు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో మూడు వారాల సమయమే మిగిలుంది. రాష్ట్రమంతటా ఎన్నికల వేడి రాజుకుంటోంది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులతో రెండు జాబితాలు విడుదల చేసింది. అందులో బండ్ల గణేష్ పేరు లేకపోవడం ఒకింత ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆయన అసెంబ్లీ టికెట్ ఆశించిన షాద్ నగర్ స్థానాన్ని ప్రతాప్ రెడ్డికి కేటాయించారు.

ఐతే బండ్ల ఇంకా ఆశతోనే ఉన్నాడంటున్నారు. ఏదో ఒక స్థానాన్ని అతడికి కేటాయించడం ఖాయం అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుంచి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తూ.. మీడియాలో ప్రముఖంగా కనిపిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటూనే వస్తున్నాడు బండ్ల. పాజిటివ్‌గానా.. నెగెటివ్‌గా అన్నది పక్కన పెడితే ఎలాగోలా బండ్ల అయితే వార్తల్లో నిలుస్తున్నాడు. సోషల్ మీడియాలో బండ్ల పాపులారిటీ మామూలుగా లేదు.

తాజాగా ఒక టీవీ ఛానెల్ స్టూడియో కూర్చుని న్యూస్ ప్రెజెంటర్ మూర్తితో చిట్ చాట్ చేశాడు బండ్ల. ఈ సందర్భంగా అతను పేల్చిన పంచులు మామూలుగా లేవు. జనాలు ఎంత వీటిని ఎంత సీరియస్‌గా తీసుకుంటారన్నది పక్కన పెడితే.. తెలంగాణ ప్రభుత్వం మీద ఆ పంచులైతే భలేగా పేలాయి. జనాల్ని నవ్విస్తున్నాయి. కేసీఆర్ హామీల్ని ఎద్దేవా చేస్తూ ఈ పంచులు పేల్చాడు బండ్ల. కేసీఆర్ పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇల్లే అని చెప్పాడని.. ఐతే తామందరం ఇల్లు ఇస్తారని అనుకున్నామని కానీ.. ఆయన 'ఇల్లే' (తమిళంలో లేదు) అని చెప్పారని లేటుగా అర్థమైందని.. ఆయన తప్పేమీ లేదని బండ్ల అన్నాడు.

అలాగే రాష్ట్రంలో వెనుకబడిన తరగుతుల వాళ్లకు మూడు ఎకరాల ఇల్లు ఇస్తామన్నాడని.. అంటే ప్రతి ఒక్కరికీ మూడు ఎకరాలని తామనుకున్నామని.. కానీ రాష్ట్రంలోని అందరికీ కలిపి మూడు ఎకరాలని కేసీఆర్ అన్నాడని తర్వాత అర్థమైందని బండ్ల అన్నాడు. అలాగే ప్రతి నల్లాలో నీళ్లు అని చెప్పి నీళ్లు ‘నిల్' చేశారని ఎద్దేవా చేశాడు బండ్ల. 'కేజీ టూ పీజీ ఎడ్యుకేషన్' పథకం గురించి స్పందిస్తూ.. 'కేజీ టూ పీజీ విషయంలో కేసీఆర్ పడ్డాడు రాజీ.. కాబట్టే జనాలు ఆయన్ని చేయబోతున్నారు మాజీ' అంటూ ప్రాస డైలాగ్ కొట్టాడు బండ్ల. ఇలాంటి పంచులతో బండ్ల చెలరేపోయిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English