ప‌వ‌న్‌కు సీబీఐ మాజీ జేడీ ఝ‌ల‌క్‌!

ప‌వ‌న్‌కు సీబీఐ మాజీ జేడీ ఝ‌ల‌క్‌!

తిత్లీ తుపాను స‌మయంలో త‌గిన రీతిలో స్పందించ‌లేదంటూ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడి నేతృత్వంలోని రాష్ట్ర ప్ర‌భుత్వంపై ప‌దేప‌దే విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీ నారాయ‌ణ ఝ‌ల‌క్ ఇచ్చారు. ప‌వ‌న్ పేరును ప్ర‌స్తావించ‌కుండానే ఆయ‌న విమ‌ర్శ‌ల‌ను త‌ప్పుప‌ట్టారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం స్పందించిన తీరును స‌మ‌ర్థించారు.

తిత్లీ తుపాను సంభ‌వించిన 4 గంట‌ల వ్య‌వ‌ధిలోనే చంద్ర‌బాబు త‌న కేబినెట్ మొత్తాన్ని ప‌లాస‌కు తీసుకొచ్చారు. అక్క‌ణ్నుంచే ప‌రిపాల‌న న‌డిపించారు. వాస్త‌వానికి అంత‌కు ఒక‌రోజు ముందు నుంచే ఆయ‌న తుపాను ప్ర‌భావాన్ని అంచ‌నా వేస్తూ ఉన్నారు. అధికారుల‌కు త‌గిన ఆదేశాలిచ్చారు. తుపాను వ‌చ్చే ముందు రోజు రాత్రి నిద్ర కూడా పోలేదు. నిరంతరం స‌మీక్ష‌లు నిర్వ‌హించారు. తుపాను త‌ర్వాత కూడా దాదాపు 12 రోజులు శ్రీ‌కాకుళంలోనే ప‌నిచేసి ప‌రిస్థితుల‌ను చ‌క్క‌దిద్దారు. రికార్డు స‌మ‌యంలో బాధితుల‌కు ప‌రిహారం కూడా అంద‌జేశారు.

అదే స‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ మాత్రం తుపాను బాధితుల‌ను ప‌ట్టించుకోలేదు. ఎంచ‌క్కా హైద‌రాబాద్ చెక్కేశారు. ఇక జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న క‌వాతు ప‌నుల్లో బిజీగా గ‌డిపారు. ప‌వ‌న్‌ తీరిగ్గా ఆరు రోజుల త‌ర్వాత తుపాను బాధితుల‌ను ప‌రామ‌ర్శించారు. ఆ త‌ర్వాత నుంచి టీడీపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు ప్రారంభించారు. తుపాను స‌మ‌యంలో ప్ర‌భుత్వం స‌రిగా వ్య‌వ‌హ‌రించ‌లేద‌ని ఆరోపించారు. తిత్లీ బాధితుల‌కు చంద్ర‌బాబు వేరుసెన‌గంత సాయం చేసి ఎవ‌రెస్టు ప‌ర్వ‌త‌మంత ప్ర‌చారం చేసుకుంటున్నారంటూ దుయ్య‌బట్టారు.

తాజాగా సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీ నారాయ‌ణ ఈ వ్య‌వ‌హారంపై ఓ ఇంట‌ర్వ్యూలో స్పందించారు. తిత్లీ ప్ర‌భావిత ప్రాంతాల‌ను తాను సంద‌ర్శించాన‌ని.. అదొక భీక‌ర తుపాను అని తెలిపారు. అంత‌టి దారుణ‌మైన తుపానును ప్ర‌భుత్వ యంత్రాంగం స‌మ‌ర్థంగా ఎదుర్కొంద‌ని కితాబిచ్చారు. అన్నీ క్ష‌ణాల్లో జ‌రిగిపోవ‌డానికి ఇదేమీ మాయాబ‌జార్ సినిమా కాదు క‌దా? అని వ్యాఖ్యానించారు. తాను చూసినంత‌వ‌ర‌కు అంతా స‌వ్యంగా జ‌రిగింద‌ని.. ప్ర‌భుత్వం త‌గిన‌విధంగా స్పందించ‌లేద‌న‌డం భావ్యం కాద‌ని సూచించారు. దీంతో సీబీఐ మాజీ జేడీ త‌న వ్యాఖ్య‌ల‌తో ప‌వ‌న్‌కు బాగా బుద్ధి చెప్పార‌ని ప‌లువురు చెప్పుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English