కేసీఆర్ మార్క్‌..టీఆర్ఎస్ మూడో జాబితా వెలువ‌డింది

కేసీఆర్ మార్క్‌..టీఆర్ఎస్ మూడో జాబితా వెలువ‌డింది

తెలంగాణ అప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్‌ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు సంబంధించి మ‌రింత దూకుడు పెంచారు. నామినేష‌న్ల ప్ర‌క్రియ మొద‌లవుతున్న నేప‌థ్యంలో త‌న పార్టీ అభ్య‌ర్థుల‌కు దిశానిర్దేశం చేసిన కేసీఆర్‌...ఈ సంద‌ర్భంగా ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ముందుకు సాగాల‌ని స్ప‌స్టం చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ వెంట‌నే తాను ప్ర‌త్య‌క్షంగా రంగంలోకి దిగి నామినేష‌న్ దాఖ‌లు చేశారు. త‌న‌కు అచ్చివ‌చ్చిన కోనాయిప‌ల్లి దేవాల‌యంలో పూజ‌లు చేసిన అనంత‌రం నామినేష‌న్ వేసిన అనంత‌రం పెండింగ్‌లో ఉన్న పార్టీకి సంబంధించిన ప్ర‌క్రియ‌ల‌పై దృష్టి సారించారు.

టీఆర్ఎస్ పార్టీ త‌ర‌ఫున ప్ర‌క‌టించాల్సి ఉన్న పెండింగ్ లిస్ట్‌పై సారించి గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ పది నియోజకవర్గాల టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను  ప్రకటించారు. కోదాడ ముషీరాబాద్ నియోజకవర్గాల అభ్యర్థులకు సంబంధించి పార్టీ ముఖ్య నాయకులతో చర్చించి ఒకటి, రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ ప్రకటించారు. తాజాగా ప్ర‌క‌టించిన వాటిలో మేడ్చల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్ర‌స్తుత ఎంపీ చామకూర మల్లారెడ్డికి అవ‌కాశం క‌ల్పించారు. మల్కాజిగిరిలో ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావు, వరంగల్ తూర్పులో మేయ‌ర్ నన్నపునేని నరేందర్, గోషామహల్‌లో మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాథోడ్, చార్మినార్‌లో మహమ్మద్ సలావుద్దీన్ లోడి,  హుజూర్ న‌గర్‌లో ఎన్నారై శానంపూడి సైదిరెడ్డి వికారాబాద్ లో డాక్టర్ మెతుకు ఆనంద్, అంబర్‌పేటలో కాలేరు వెంకటేష్,  చొప్పదండిలో సొంకె రవిశంకర్ , ఖైరతాబాద్‌లో దానం నాగేందర్ అభ్యర్థిత్వాలను కేసీఆర్ ఖరారు చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English