2,382...అమెరికా జైల్లో మ‌గ్గుతున్న మ‌నోళ్ల సంఖ్య‌

2,382...అమెరికా జైల్లో మ‌గ్గుతున్న మ‌నోళ్ల సంఖ్య‌

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ప్రభుత్వం వలస విధానాన్ని సీరియస్‌గా తీసుకోవడంతో గత కొన్ని రోజులుగా అమెరికాలో పెను దుమారం చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఇమ్మిగ్రేషన్ చట్టాలను అమెరికా ప్రభుత్వం పటిష్టంగా అమలు చేస్తుండ‌టం...వంద‌లాది మందిని అరెస్టులు చేస్తుండ‌టంతో వివిధ దేశాల నుంచి అమెరికాకు అక్రమంగా వెళ్లిన వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ క్ర‌మంలో  తాజాగా భారత్‌కు సంబంధించి కీల‌క స‌మాచారం వెలుగులోకి వ‌చ్చింది. అమెరికా జైళ్లలో 2382 మంది భారతీయులు ఉన్నారని తేలింది. అక్రమంగా సరిహద్దులు దాటి అమెరికాలోకి ప్రవేశించారనే కారణంతో దాదాపు 2,382 మంది భారతీయులు అమెరికా జైళ్లలో మగ్గుతున్నారని ఓ నివేదిక వెల్లడించింది.

అమెరికా సమాచార హక్కు చట్టం ద్వారా నార్త్‌ అమెరికన్‌ పంజాబీ అసోసియేషన్‌(ఎన్ఏపీఏ) అమెరికాలోని జైళ్ల‌లో మ‌గ్గుతున్న‌వారి వివ‌రాల‌ను వెల్ల‌డించింది. అమెరికాలో 86 జైళ్లలో 2,382 మంది భారతీయులు ఉన్నారని సమాచారం ఇచ్చిన‌ట్లు సదరు నివేదిక వెల్లడించింది. వీరిలో అమెరికాలో ఆశ్రయం కోరుతూ అక్రమంగా సరిహద్దులు దాటినట్లు తెలిపింది. వీరిలో ఎక్కువ మంది భారత్‌లోని పంజాబ్‌ రాష్ట్రం నుంచి వెళ్లిన వారు ఉన్నారని నివేదిక వెల్లడించింది. పంజాబ్‌ నుంచి వెళ్లిన వారు తమ ప్రాంతంలోని హింసాత్మక పరిస్థితుల కారణంగా ఆశ్రయం కోరుతూ అమెరికా వచ్చినట్లు తెలిపారని నివేదిక తెలిపింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English