మేన‌ల్లుడి స‌త్తా మేన‌మామ‌కు ఇప్ప‌టికి అర్థ‌మైందా?

మేన‌ల్లుడి స‌త్తా మేన‌మామ‌కు ఇప్ప‌టికి అర్థ‌మైందా?

టీఆర్ఎస్ పార్టీ పెట్టింది మొద‌లు ఇప్ప‌టివ‌ర‌కూ కేసీఆర్ కు ద‌గ్గ‌రైనోళ్లు.. దూర‌మైనోళ్ల లెక్క అంతా ఇంతా కాదు. నాటి నుంచి నేటి వ‌ర‌కూ పార్టీలోనే ఉన్నోళ్లు కొల్లులు. అయితే.. ముఖ్య‌నేత‌లుగా గుర్తింపు పొందినోళ్లు.. అవ‌కాశాలు ద‌క్క‌నోళ్లు.. ఇచ్చిన క‌మిట్ మెంట్‌కు త‌గ్గ‌ట్లుగా ప‌ద‌వులు ఇవ్వ‌కున్నా పార్టీ నుంచి వెళ్లిపోవ‌టం తెలిసిందే.


అయితే.. వీరంద‌రికి భిన్నంగా త‌న‌ను న‌మ్మిన మేన‌మామ విష‌యంలో ఎప్పుడూ ప‌ల్లెత్తు మాట అన‌ని తాజా మాజీ మంత్రి హ‌రీశ్ రావుపై పార్టీ అధినేత కేసీఆర్ అప్పుడ‌ప్పుడు ప‌క్క‌న పెట్టేస్తుంటార‌న్న టాక్ వినిపిస్తూ ఉంటుంది.

అందుకు త‌గ్గ‌ట్లే టీఆర్ఎస్ అధికార ప‌త్రిక‌లో హ‌రీశ్ ఫోటోను ప్ర‌ముఖంగా వేయ‌టం.. ఫ‌స్ట్ పేజీలో ఆయ‌న ఫోటో క‌నిపించి చాలానే నెల‌లు అయిన‌ట్లుగా చెబుతారు. అయితే.. గ‌డిచిన 20 రోజులుగా సీన్ లో మార్పు వ‌చ్చేసింది. నెల‌ల త‌ర‌బ‌డి స‌ద‌రు ప‌త్రిక‌లో హ‌రీశ్ ఫోటో క‌నిపించ‌ని స్థానే.. ఇప్పుడు మొద‌టి పేజీలో హ‌రీశ్ ఫోటో అచ్చేస్తున్న వైనం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

ఎందుకిలా?  మొద‌ట ప‌క్క‌న పెట్టేసిన హ‌రీశ్ ను ఇప్పుడు అక్కున చేర్చుకోవ‌టానికి మ‌ధ్య‌లో ఏం జ‌రిగింద‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌ర అంశంగా మారింది. ముంద‌స్తు ఎన్నిక‌ల ప్ర‌క‌ట‌న ముందు నుంచి హ‌రీశ్ ను పెద్ద‌గా ప‌ట్టించుకోన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించిన కేసీఆర్ తీరు ఇప్పటికిప్పుడు మార‌టానికి వెనుక కార‌ణం చూస్తే.. ప‌లు అంశాలు క‌నిపిస్తున్నాయి.

త‌న కొడుక్కి పోటీగా వ‌స్తున్న హ‌రీశ్ స్థానాన్ని అత‌డికే తెలిసేలా చేయ‌టం కోస‌మే.. త‌మ ప‌త్రిక‌లో హ‌రీశ్ ఫోటోను మాత్ర‌మే కాదు.. ఆ పేరును ప్ర‌చురించే విష‌యంలోనూ ప‌రిమితులున్న‌ట్లు చెబుతారు.

దీనికి తోడు.. కొంద‌రు పార్టీ అధినేత‌ల‌తో లోగుట్టుగా హ‌రీశ్ భేటీ అవుతున్నార‌ని.. రానున్న రోజుల్లో మ‌రో చంద్ర‌బాబు నాయుడిలా వ్య‌వ‌మ‌రిస్తారేమో అన్న సందేహాలతోనే ఆయ‌న్ను ప‌క్క‌న పెట్టిన‌ట్లుగా స‌మాచారం. అయితే.. ఈ ధోర‌ణి కేసీఆర్‌.. కేటీఆర్ ల‌కు నెగిటివ్ గా మార‌టం.. హ‌రీశ్ పైన సానుభూతి అంత‌కంత‌కూ పెరిగిపోతున్న ప‌రిస్థితి.

దీంతో వాస్త‌వ ప‌రిస్థితిని గుర్తించిన కేసీఆర్ దిద్దుబాటు చ‌ర్య‌ల్ని చేప‌ట్టిన‌ట్లు చెబుతున్నారు. హ‌రీశ్ ను బుజ్జ‌గించ‌టంతో పాటు.. అత‌డికిచ్చే ప్ర‌యారిటీ విష‌యంలో అనూహ్య‌మైన మార్పులు వ‌చ్చేట‌ట్లుగా చెబుతున్నారు. మొన్న‌టి వ‌ర‌కూ హ‌రీశ్ పేరు వినిపించినంత‌నే అంటీ ముట్ట‌నట్లుగా వ్య‌వ‌హ‌రించే వారు ఫుల్ అలెర్ట్ అయిపోయారు.

అంతేనా.. త‌మ అధికారిక పేప‌ర్లోనూ.. న్యూస్ ఛాన‌ల్ లోనూ హ‌రీశ్ ను విప‌రీతంగా వాడేస్తున్నారు. ఒక‌ద‌శ‌లో హ‌రీశ్ ను పూర్తిగా ప‌క్క‌న పెట్టేసిన కేసీఆర్ ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా ఆయ‌న్ను ప్ర‌తి విష‌యంలోనూ త‌మ ప‌క్క‌న ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌టం క‌నిపిస్తోంది. వాతావ‌ర‌ణం తాను అనుకున్నంత అనుకూలంగా లేద‌న్న స‌త్యాన్ని గుర్తించిన కేసీఆర్ దిద్దుబాటు చ‌ర్య‌ల్ని చేప‌ట్టిన‌ట్లుగా చెబుతున్నారు. దీంతో నిన్న‌టి వ‌ర‌కూ కూర‌లో క‌రివేపాకులా ఉన్న హ‌రీశ్ ప‌రిస్థితి ఇప్పుడు అందుకు భిన్నంగా మారిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు. అందుకే అనేది.. రాజ‌కీయాల్లో ఎవ‌రి ప‌రిస్థితి ఎప్పుడూ ఒకేలా ఉండ‌ద‌ని.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English