2014 లో మోడీ బ‌ల‌మెంతో చెప్పిన పి.కె

2014 లో మోడీ బ‌ల‌మెంతో చెప్పిన పి.కె

ప్ర‌శాంత్ కిషోర్‌... జేడీ యు పార్టీలో చేరి ఒక్క‌సారిగా అంద‌రికీ షాకిచ్చారు. పార్టీల త‌ల‌రాత‌లు రాసే స్ట్రాట‌జిస్టు ఒక పార్టీలో చేర‌డం ఏంటి? అది కూడా ఓ చిన్నపార్టీలో చేర‌డం ఏంటి? అని అంద‌రూ విస్మ‌యం చెందారు. తాజాగా ఆయ‌న ఓ మీడియా ఇంట‌ర‌వ్యూలో అనేక ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు చెప్పుకొచ్చారు. అందులో రెండు కీల‌క పాయింట్లు ఉన్నాయి. ఒక 2014లో మోడీ ప‌రిస్థితి. ఎల‌క్ష‌న్ల‌లో ఓట‌ర్ల నాడి.

మోడీ గురించి ఆయ‌న ఏం చెప్పారంటే... దేశంలో ఇప్పటికైతే ప్రధాని నరేంద్ర మోదీయే స్ట్రాంగ్ లీడ‌ర్‌. కానీ ఎన్నిక‌ల‌కు ఇంకా చాలా టైం ఉంది. 2014 లోక్‌సభ ఎన్నికల స్థాయి ఫలితాలు పునరావృతం కావు. సంకీర్ణ ప్ర‌భుత్వం వ‌స్తుంది. ‘‘విపక్షం బలంగా ఉందా? బలహీనంగా ఉందా? అన్నది పాయింటే కాదు.  ప‌లు ఇత‌ర అంశాల ప్ర‌భావ‌మే ఎక్కువ‌.  2014తో పోలిస్తే స్మార్ట్ ఫోన్ల సంఖ్య 4 కోట్ల నుంచి 40 కోట్ల‌కు పెరిగింది. మోడీ మునుప‌టి స్ట్రాట‌జీ ఇపుడు ప‌నిచేయ‌దు.

ఓట‌ర్ల నాడి గురించి ఆయ‌న ఏం చెప్పారంటే... దేశంలో 70 శాతం మందివి అతిచిన్న జీతాలు. వారు ఎవరికి ఓటేస్తారో తెలియదు. సోష‌ల్ మీడియాలో నూత‌న‌త్వం పోయింది. ఇపుడు ప‌రిస్థితులు పూర్తిగా మారిపోయాయి. 30 సెక‌న్లు వీడియోలు ఎక్కువ‌గా క్రియేట్ చేసిన వారు ఎక్కువ‌గా ర్యాలీలు తీసిన వారికంటే జ‌నాల‌కు బాగా రీచ్ అవుతారు. ఎన్నికల్లో గెలవాలన్నా ఓడాలన్నా చివరి 10-12 రోజులే కీలకమని నా పన్నెండేళ్ల అనుభవం చెబుతోంది.  బీజేపీ, కాంగ్రెస్‌లతో కూడా కలిసి పని చేశాను, నేటి యువతను రాజకీయాల్లోకి ఆకర్షించడం చాలా కష్టమైన విషయం.

త‌న పార్టీ గురించి ఆయ‌న ఏం చెప్పారంటే... బీహార్‌లో పని చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయ పార్టీలకు స్ట్రాట‌జీలు ఇవ్వ‌డం మానేసి ప్ర‌త్య‌క్ష ఎన్నికల్లోకి దిగాను. జేడీయూ చిన్న పార్టీయే కానీ దానికి ఇబ్బందికర చరిత్ర లేదు. మిగ‌తా వాటి మీద నాకు ఇది కాస్త ఆస‌క్తిక‌రంగా అనిపించింది. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English