అమిత్ షా.. ముందు నువ్వు హిందు పేరు పెట్టుకో

అమిత్ షా.. ముందు నువ్వు హిందు పేరు పెట్టుకో

భార‌తీయ జ‌న‌తా పార్టీ... హిందు ప‌రిర‌క్ష‌కులం, రాముడి గుడి క‌ట్టిస్తాం అని చెప్పినంత కాలం ఇది మ‌త‌రాజ‌కీయం. అంత‌కుమించి ఏం కాదు అని జ‌నం భావించారు కాబ‌ట్టి దానికి ఎపుడూ సంపూర్ణ మెజారిటీ ఇవ్వ‌లేదు. కానీ ఎపుడైతే న‌రేంద్ర‌మోడీ అవినీతి ర‌హిత పాల‌న గురించి, దేశం గురించి, డాల‌ర్ గురించి, అభివృద్ధి గురించి మాట్లాడారో అపుడు మాత్ర‌మే జ‌నం బీజేపీని న‌మ్మారు. అవ‌కాశం ఇద్దాం అని ప‌ట్టం కట్టారు.

ఇది భార‌తీయుల చైత‌న్యం. అయితే, భార‌తీయుల న‌మ్మ‌కాన్ని న‌రేంద్ర‌మోడీ నిల‌బెట్టుకోలేదు. ఆయ‌న పాల‌న‌లో దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. దీనికి  తాజా ఉదాహ‌ర‌ణ ఆర్‌బీఐ మాజీ చైర్మ‌న్ ర‌ఘురామ్ రాజ‌న్ చేసిన వ్యాఖ్య‌లే. నోట్ల ర‌ద్దు, జీఎస్టీ వ‌ల్ల భార‌త ఆర్థిక వృద్ధి తిరోగ‌మ‌నం చెందింద‌ని ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం అయ్యాయి.

మోడీ నిర్ణ‌యాలు ఏ విష‌యంలోనూ దేశాన్ని ముందుకు తీసుకెళ్ల‌లేక‌పోయాయి. జ‌నాలకు స‌బ్సిడీలు త‌గ్గించ‌డం మిన‌హా మోడీ తెచ్చిన మంచి మార్పు ఏమీ లేదు. దీంతో త‌మ‌ను జ‌నం న‌మ్మ‌డం లేద‌ని గ్ర‌హించిన మోడీ టీం కొత్త పాచిక‌లు వేయ‌డం మొద‌లుపెట్టింది. మ‌త రాజ‌కీయం పూర్తి స్థాయిలో అమ‌లుచేస్తున్నారు.

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రముఖ నగరాలు, వీధుల పేర్లను ఇష్టానుసారంగా మార్చడం ఇటీవ‌ల చూశాం. దీనిపై ప్రముఖ చరిత్రకారుడు ఇర్ఫాన్ హబీబ్ నుంచి ఘాటు విమ‌ర్శ వ‌చ్చింది. ఆదిత్యనాథ్ నిర్ణ‌యాల‌కు లాజిక్ లేదు. ఎక్కడైనా పేర్ల మార్పుకు చారిత్రక అంశాలు కార‌ణం అవుతాయి. కానీ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు, జ‌నాల్లో ఎమోష‌న్స్ కోసం కుట్ర పూరితంగా పేర్లు మార్చ‌డం ఇక్క‌డ జ‌రుగుతోంది.. అని ఆయ‌న వ్యాఖ్యానించారు.

పాకిస్తాన్ దేశవిభజన తర్వాత ఇస్లామిక్ గా అనిపించని నగరాలు, ప్రాంతాల పేర్లను మార్చేసిందని, ఇపుడు అదే త‌ప్పు ఇండియాలో జ‌రుగుతోంద‌న్నారు. ఆయ‌న మాట‌ల్లో ఒక ట్విస్ట్ కూడా ఉంది. బీజేపీ వాళ్లు ముందు ఒక విష‌యాన్ని గ్ర‌హించాలి. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పేరు ఇండియా పేరే కాదు. అందు లోని ‘షా’ అనే ఇంటిపేరు అసలు గుజరాతీది కాదు. అది పర్షియన్(ఇరాన్) పేరు. నిజంగా హిందుత్వ పేర్లను పెట్టాలనుకుంటే ముందుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడి పేరును మార్చాలని చురక వేశారు హ‌బీబ్‌.

ఇంకా పెద్ద షాక్ ఏంటంటే... గుజరాత్ అన్నది పర్షియన్ పదమని, వాస్తవానికి దాన్ని గుర్జరాట్రగా పిలవాల్సి ఉంటుంది. కాబ‌ట్టి  అమిత్‌షా పేరు, గుజ‌రాత్ ప‌ర్షియ‌న్ పేర్లు పెట్టుక‌ని ఇత‌ర న‌గ‌రాలు మ‌నుషుల పేర్లు మార్చ‌డం విచిత్రంగా అనిపిస్తోంద‌న్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English