కూట‌మిలో చీలిక‌...కోదండ‌రాం కామెంట్లే నిద‌ర్శ‌నం

కూట‌మిలో చీలిక‌...కోదండ‌రాం కామెంట్లే నిద‌ర్శ‌నం

తెలంగాణ కాంగ్రెస్ సార‌థ్యంలో సాగుతున్న ప్ర‌జాకూట‌మి త‌న పొత్తుల ప్ర‌క్రియ‌లోనే అప‌సోపాలు ప‌డుతోంది. సీట్ల కేటాయింపులో తీవ్ర త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌రిస్థితిని ఎదుర్కుంటోంది. ఒక‌డుగు ముందుకు..ప‌ది అడుగులు వెన‌క్కు అన్న‌ట్లుగా ప‌రిస్థితి క‌నిపిస్తోంది. తాజాగా తెలంగాణ జ‌న‌స‌మితి నేత ప్రొఫెస‌ర్ కోదండ‌రాం చేసిన వ్యాఖ్య‌లు కూట‌మి భ‌విష్య‌త్‌ను ప్ర‌శ్నార్థం చేస్తున్నాయి.  మాకే తెలియని సమాచారం మీకెలా తెలుసు.. సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్ ఇంకా క్లారిటీనే ఇవ్వలేదు.. 8 సీట్లను తేల్చనూలేదు అంటూ క్లైమాక్స్‌లో షాక్ ఇచ్చారు టీజేఎస్ నేత కోదండరాం.

ఢిల్లీలో చ‌ర్చ‌లు జ‌రిగాయని, టీజేఎస్‌కు 8 సీట్లు ఇచ్చార‌ని వార్తలు వ‌చ్చిన నేప‌థ్యంలో కోదండరాం మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ నుంచి ఇంకా ఫైనల్ డెసిషన్ రాలేదని వివరించారు.``వారి చర్చలే కొలిక్కిరాలేదు... మా సంగతి ఇప్పుడే పట్టించుకుంటారా?  `సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్ ఇంకా క్లారిటీనే ఇవ్వలేదు.. 8 సీట్లను తేల్చలేదు` అన్నట్లు కాంగ్రెస్ తీరుపై చురకలు అంటించారు. కాగా,  కోదండరాం వ్యాఖ్యలతో మరోసారి కూటమిలో కలకలం రేగింది. ఇప్పటికీ కూటమిని నిలబెట్టేందుకు చర్చలు జరుపుతున్నాం అంటూ తూటాలు పేల్చారు. సార్.. వ్యాఖ్యలు చూస్తుంటే కూటమిలో సీట్ల సర్దుబాటుపై అవగాహనే లేదని స్పష్టం అవుతుంది.

మ‌రోవైపు కూట‌మిలో మిత్ర‌ప‌క్ష‌మైన‌ సీపీఐ గంద‌ర‌గోళంలో ప‌డిపోయింది. సీపీఐ ఎంత డిమాండ్ చేసినా.. 3 సీట్లకు మించి ఇచ్చేదిలేదని కాంగ్రెస్ తెగేసి చెబుతుండ‌టంతో దీనికి సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి ససేమిరా అంటున్నారు. అడిగినన్ని సీట్లు, కోరిన నియోజకవర్గాలు ఇవ్వాల్సిందే అని పట్టుబడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సీట్లు మాత్రమే తీసుకోవటానికి సిద్ధంగా లేమంటూ వార్నింగ్ ఇచ్చి సమస్యను పరిష్కరించటంలో కాంగ్రెస్ ఎందుకు తాత్సారం చేస్తుందని నిలదీశారాయన. సీట్ల కేటాయింపు విషయంలో కాంగ్రెస్ ఏకపక్షంగా వ్యవహరించటాన్ని తప్పుబడుతూనే.. టైం లేదు.. ఏదో ఒకటి తేల్చకుంటే మా దారి మేం చూసుకుంటాం అని వార్నింగ్ బెల్ మోగించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English