కాంగ్రెస్ రాజ‌కీయ‌మే వేరు!

కాంగ్రెస్ రాజ‌కీయ‌మే వేరు!

కాంగ్రెస్ పార్టీలో వాయిస్ ఉన్నోడిదే సీటు. ఏ ఎన్నిక జ‌రిగినా అంతే. స‌ర్దుకుపోయామా ఇక ఖేల్‌ఖ‌తం దుకాణ్ బంద్‌. ఈ సూత్రం తెలిసిన కాంగ్రెస్ నేత‌లు త‌మ ప‌ని సాధించుకుంటారు. దీన్ని అర్థం చేసుకోనివాళ్లు వెనుక‌ప‌డ‌తారు. ఎన్నిక‌లు వ‌స్తే కాంగ్రెస్ అధిష్టానానికి పెద్ద పరీక్ష‌. బుజ్జ‌గింపుల‌తోనే స‌రిపోతుంది. అదే ప్రాంతీయ పార్టీలు ఎన్నిక‌లు వ‌స్తే మ‌రింత బ‌ల‌ప‌డ‌తాయి. కానీ కాంగ్రెస్ మాత్రం ఇరుకున ప‌డుతుంది. తాజాగా అనేక పార్టీల‌తో పొత్తు పెట్టుకుని మ‌హాకూట‌మిగా ఏర్పాటైన కాంగ్రెస్‌లో సీట్ల గోల తీవ్రంగా ఉంది. అందులో రెబ‌ల్ వాయిస్ గ‌ట్టిగా వినిపించిన వారిలో కోమ‌టి రెడ్డి ఒక‌రు. కోమ‌టి రెడ్డి ఈసారి కొత్త‌గా ట్రై చేశాడు. నా అన‌చుడు చిరుమర్తి లింగయ్య టిక్కెట్ ఇవ్వ‌క‌పోతే నా టిక్కెట్ కూడా తీసుకోను అని ప‌ట్టుబ‌ట్టారు.

న‌ల్గొండలోని నకిరేక‌ల్ సీటును తెలంగాణ ఇంటిపార్టీకి కేటాయించనున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో కోమటిరెడ్డి అలిగారు. మొండికేశారు. తాను అస‌లు పోటీయే చేయ‌ను అన్నారు. చివ‌ర‌కు అధిష్టానం అత‌నికి ట‌చ్‌లోకి వ‌చ్చింది. నీ మాట మ‌న్నిస్తామ‌ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాటిచ్చింది. నకిరేకల్ సీటు చిరుమర్తి లింగయ్య కు న‌కిరేక‌ల్ సీటు ఇవ్వ‌డానికి సిద్ధ‌మ‌య్యింది.  

ఈ వ్య‌వ‌హారంపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి కుంతియా స్పందించారు. తెలంగాణ ఇంటిపార్టీకి న‌కిరేక‌ల్ సీటు ఇస్తామ‌ని మేము చెప్ప‌లేద‌ని, వారికి ఇంకా ఎక్కడ సీటు ఇచ్చేదీ నిర్ణ‌యించ‌లేద‌ని పార్టీ క‌వ‌ర్ చేసుకుంది. అంటే చూద్దాం కోమ‌టిరెడ్డి స్పంద‌న ఎలా ఉంటుందో అని ఒక లీకు ఇచ్చి కాంగ్రెస్ ట్రై చేసిందేమో అని కొంద‌రు అనుమానాలు వ్య‌క్తంచేస్తున్నారు. మొత్తానికి కోమ‌టిరెడ్డి పోరాటంతో నకిరేకల్ సీటు చిరుమర్తి లింగయ్యకే ద‌క్కింది. ఈ మేర‌కు కుంతియా హామీ ఇచ్చేశార‌ట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English