రేవంత్ డిమాండ్‌తో కాంగ్రెస్ ఢ‌మాల్‌

రేవంత్ డిమాండ్‌తో కాంగ్రెస్ ఢ‌మాల్‌

ఎపుడొచ్చామ‌న్న‌ది కాద‌న్న‌య్యా... బుల్లెట్ దిగిందా లేదా? అన్న‌ట్లే ఉంది రేవంత్ పొలిటిక‌ల్‌ కెరీర్‌. తెలుగుదేశంలో అతి స్వ‌ల్ప కాలంలోనే రేవంత్‌రెడ్డి కీల‌కంగా ఎదిగారు. తెలంగాణ నేత‌లలో ఎంద‌రున్నా రేవంత్ రెడ్డి నెం.2 అయ్యారు. బాబు మ‌న‌సులో మాత్రం తెలంగాణ‌లో రేవంత్‌రెడ్డి కీల‌కం అని తెలుసు. రాజ‌కీయాల్లో వాగ్దాటి, దేన్న‌యినా ఎదిరించి త‌ట్టుకోగ‌లిగిన గుణం, ప్ర‌తికూల ప‌రిస్థితుల్లో లొంగ‌క‌పోవ‌డం... ఇవి మూడు  కీలక ల‌క్ష‌ణాలు. సాధార‌ణంగా ఈ మూడు అంద‌రిలో ఉండ‌వు. కానీ అవ‌న్నీ ఉన్న ఏకైక లీడ‌ర్ రేవంత్‌రెడ్డే. అయితే, విభ‌జ‌న అనంతర ప‌రిస్థితుల మూలాన రేవంత్ రెడ్డి తెలుగుదేశం వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ వ్య‌క్తిగ‌తంగా రేవంత్‌కు, చంద్రబాబుకు మంచి సంబంధాలున్నాయి. ఇపుడు మ‌హాకూమితో ఇరు పార్టీలు క‌ల‌వ‌డంతో చివ‌ర‌కు రేవంత్ రెడ్డికి మ‌రింత బ‌లం చేకూరిన‌ట్ట‌య్యింది.

అయితే, కాంగ్రెస్  పార్టీ ఓ స‌ముద్రం. అందులోకి రేవంత్‌రెడ్డి వెళ్తే పిల్ల‌కాలువ అయిపోతారేమో అని కొంద‌రు అనుమానాలు వ్య‌క్తంచేశారు. కానీ... రాజ‌కీయాల్లో ప్ర‌జ‌లను గెల‌వ‌డం తెలిసిన వాడికి నాయ‌కుడిని గెల‌వ‌డం ఎంత ప‌ని. అది నిరూపితం అయ్యింది. కొడంగ‌ల్‌లో కేసీఆర్ పోటీ చేసినా రేవంతే గెలుస్తాడు. ఇలాంటి అభ్య‌ర్థిని ఏ పార్టీ అయినా గుర్తించ‌కుండా ఎలా ఉంటుంది? అందుకే కాంగ్రెస్‌లో చేరినా రేవంత్ హ‌వా త‌గ్గ‌లేదు. స‌రికదా ఉద్దండులను కాద‌ని... కాంగ్రెస్ పార్టీలో అతి కీల‌క‌మైన వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టును రేవంత్‌రెడ్డికి ఇచ్చారు. ఇది ఎవ‌రూ ఊహించ‌లేదు. ప్రాధాన్యం ఇస్తుంద‌ని తెలుసు కానీ మ‌రీ ఈ స్థాయిలో రేవంత్‌ను కాంగ్రెస్ గుర్తిస్తుంద‌ని అనుకోలేదెవ‌రూ. పైగా రేవంత్ కు ఇచ్చిన ప్రాధాన్యంపై పార్టీలో పెద్ద‌గా తిరుగుబాటు లేక‌పోవ‌డం రేవంత్ స్టామినాకు సూచిక‌.

అయితే, పార్టీ రేవంత్‌ను ఎంత కీల‌కంగా భావించినా... పార్టీ అన్నాక ఆబ్లిగేష‌న్లు, సీనియారిటీలు వంటివి ఉంటాయి. దానివ‌ల్ల కొన్ని ప‌రిమితులు ఉంటాయి. రేవంత్‌రెడ్డి స్టామినా ఎంతో తెలిసినా తెలుగుదేశంలో చంద్ర‌బాబు రెండో స్థానాన్ని రేవంత్‌కు ఇవ్వ‌డానికి ఉన్న ప‌రిమితులే ఇపుడు కాంగ్రెస్‌కు ఉన్నాయి. అందుకే రేవంత్ రెడ్డి ఈ ఎన్నిక‌ల్లో త‌న వ‌ర్గానికి చెందిన 8 మందికి టిక్కెట్లు అడ‌గ‌డంతో పార్టీకి  పెద్ద చిక్కొచ్చిప‌డింది.

ప్ర‌స్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 74 మంది అభ్యర్థుల లిస్టు త‌యారుచేసిన ఆ పార్టీ మిగిలిన 19 స్థానాలను పెండింగ్ పెట్టింది. సీట్ల కేటాయింపు వ్యవహారంపై సీనియర్‌ నాయకులు హైకమాండ్‌పై బ్లాక్‌మెయిల్ కు పాల్పడుతున్నారు.

రేవంత్ మాత్రం... నేను చెప్పిన సీట్లు ఇప్పించండి గెలిచి చూపిస్తా అని పార్టీకి చాలెంజ్ చేస్తున్నారు. ఇది పార్టీకి అంతుచిక్క‌డం లేదు. రేవంత్‌లో గెలిపించే స‌త్తా ఉన్నా నిన్నామొన్నా పార్టీలోకి వ‌చ్చిన రేవంత్ రెక‌మెండేష‌న్‌పై అంత మందికి టిక్కెట్ ఇస్తే... ఇత‌ర నాయ‌కులు పార్టీని అల్ల‌రిపాలు చేస్తారు. ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లో దారుణంగా దెబ్బ‌తీస్తారు. దీంతో రేవంత్ రెడ్డి మాట నిజ‌మే అయినా క‌న్సిడ‌ర్ చేసే ప‌రిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు. రాజ‌కీయ ప‌రిమితులే దానికి కార‌ణం. అయితే, ఈ విష‌యంపై కొంత త‌గ్గాల‌ని అన్ని విష‌యాలు ఆలోచించాల‌ని రేవంత్‌ను పార్టీ కోరింద‌ట‌. దీంతో రేవంత్ కాసింత అసంతృప్తిగా ఉన్నారు.

ఇంత‌కీ రేవంత్ రెడ్డి కోరిన సీట్లేవో తెలుసా..

1.వరంగల్ వెస్ట్ -నరేందర్ రెడ్డి
2. నిజామాబాద్ రూరల్ -అరికెల నర్సారెడ్డి
3. ఆర్మూరు -రాజారామ్ యాదవ్
4. ఎల్లారెడ్డి -సుభాష్ రెడ్డి
5. దేవరకొండ - బిల్యా నాయక్
6. ఇల్లందు - హరిప్రియ
7. సూర్యాపేట - పటేల్ రమేష్ రెడ్డి
8. చెన్నూరు - బోడ జనార్దన్

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English