జ‌గ‌న‌- ప‌వ‌న్ మీటింగ్ జ‌రిగిందా?

జ‌గ‌న‌- ప‌వ‌న్ మీటింగ్ జ‌రిగిందా?

తెలుగు రాజ‌కీయాలు చాలా హాట్‌గా న‌డుస్తున్నాయి. ఈసారి ప్ర‌చార హోరు కంటే, విమ‌ర్శ‌ల కంటే కూడా ర‌హ‌స్య బంధాలు బాగా హైలెట్ అవుతున్నాయి. కొన్ని పార్టీలు ర‌హ‌స్య సంబంధాలు నెర‌పుతుండ‌టం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. గ‌తంలో పొత్తులు అంటే బ‌హిరంగంగా ఉండేవి. కానీ ఇపుడు ర‌హ‌స్య పొత్తులు ఎక్కువ‌య్యాయి. కాంగ్రెస్‌-హ‌రీష్ రావు, బీజేపీ-జ‌న‌సేన‌, వైసీపీ - జ‌న‌సేన ఇలా రాజ‌కీయ పార్టీలు విచిత్రంగా సీక్రెట్ రాజ‌కీయాల‌కు తావివ్వ‌డం ఒక కొత్త పంథా.

తాజాగా ఏపీకి చెందిన కారెం శివాజీ ఒక సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఇటీవ‌లే వైజాగ్లోని వ‌ట్టి ర‌వి ఇంట్లో స‌మావేశ‌మ‌య్యార‌ని ఆయ‌న వెల్ల‌డించారు. అయితే వారిద్ద‌రి మ‌ధ్య సీట్ల లెక్క తేల‌లేద‌ని అందుకే ఎవ‌రి దారిలో వారు వెళ్లిపోయార‌ని కారెం శివాజీ వెల్ల‌డించారు.

విశాఖ ప‌ట్నంలో పాద‌యాత్ర జ‌రుగుతున్న సంద‌ర్భంలో ఈ సంఘ‌ట‌న జ‌రిగింద‌న్నారు. జ‌గ‌న్ పెద్ద ఎత్తున సీట్లు ప‌వ‌న్‌కు క‌ళ్యాణ్ కు సీట్లు ఆఫ‌ర్ చేసినా... ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్ప‌టికే సీఎం కుర్చీ మీద ఆశ‌ప‌డ‌టంతో వారిద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ‌లు స‌ఫ‌లం కాలేద‌ని కారెం శివాజీ చెప్పారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English