కేసీఆర్ మైండ్ బ్లాంక‌య్యే స్కెచ్చేసిన కాంగ్రెస్‌

కేసీఆర్ మైండ్ బ్లాంక‌య్యే స్కెచ్చేసిన కాంగ్రెస్‌

తెలంగాణ‌లోని ముంద‌స్తు ఎన్నిక‌ల‌ను కాంగ్రెస్ పార్టీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంటుంది. ఈ క్ర‌మంలో మ‌హాకూట‌మిలో సీట్ల పంప‌కాన్ని పూర్తిచేసింది.


తాజాగా మహాకూటమిలో సీట్ల సర్దుబాటు ఖరారు చేశారు రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ ఆర్సి కుంతియా.. ఇందులో టీడీపీకి 14 , టీజెఎస్ కు 8 , సిపిఐ కి 3 స్థానాలు సర్దుబాటు చేసినట్టు ప్రకటించారు.

కాగా మొత్తం 25 స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించినట్టు  చెప్పారు. మిగిలిన 94 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు. అలాగే 74 మందితో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను రెడీ చేసినట్టు కుంతియా వెల్లడించారు.

అయితే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 74మంది అభ్యర్థుల లిస్టుకు ఓకే చెప్పిన కాంగ్రెస్‌ మిగిలిన 20 స్థానాల అభ్యర్థుల ప్రకటనలో ఆచితూచి వ్యవహరించింద‌ని అంటున్నారు.  సీట్ల ఖ‌రారులో జాప్యం జ‌రుగుతోంద‌నే అప‌వాదును ఎదుర్కుంటున్న‌ప్ప‌టికీ, ఈ స్థానాలకు కూడా ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటిస్తే అక్కడున్న అసమ్మతి నేతలు రెబల్స్‌గా మారే అవకాశం ఉండడమే దీనికి కారణంగా కనిపిస్తోంది.

74 మంది అభ్యర్ధులతో తొలి జాబితాను ఈనెల 10న విడుదల చేయనున్న కాంగ్రెస్‌ మిగిలిన 20 స్థానాలపై వ్యూహాత్మకంగానే జాప్యం చేస్తోంది. టికెట్‌ రాని నేతలకు ప్రత్యర్థి పార్టీలు గాలం వేయకుండా చివరి నిమిషంలో అభ్యర్థులను ప్రకటించనుందని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ముంద‌స్తు స్కెచ్‌తో గుఆలాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్‌కు షాక్ ఖాయ‌మ‌ని ప‌లువురు అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English