మోడీ సర్కార్‌కు ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ ఝలక్

మోడీ సర్కార్‌కు ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ ఝలక్

దీపావళి కానుకగా గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ సినిమా. అంచనాల్ని అందుకోవడం ఈ చిత్రం పూర్తిగా విఫలమైంది. పైపై మెరుగులు తప్ప ఇంకేమీ లేవని తేల్చేశారు అటు క్రిటిక్స్.. ఇటు ప్రేక్షకులు. ఈ చిత్రంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడుస్తోంది. దీంతో పాటుగా కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారును ఆటాడుకోవడానికి కూడా ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ సామాజిక మాధ్యమాల్లో బాగా ఉపయోగపడుతోంది.

మోడీ సర్కారు ఓ గొప్పలు పోతూ చేపట్టిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి నిన్నటితో ,రెండేళ్ల పూర్తయింది. డీమానిటైజేషన్ వల్ల జీడీపీ రెండు శాతం పెరుగుతుందని.. నల్లధనమంతా బయటికి వచ్చేస్తుందని.. ఇంకా ఏవేవో గొప్ప గొప్ప మార్పులు జరిగిపోతాయని డబ్బా కొట్టుకున్నాడు మోడీ. దీని వల్ల సానుకూల ఫలితాలు రాకుంటే తనను ఉరి తీయాలని కూడా ఢాంబికాలు పలికాడు. తీరా చూస్తే డీమానిటైజేషన్ వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని తేలింది. జీడీపీ రెండు శాతం పెరగకపోగా 1.5 శాతం తగ్గింది. కొత్త నోట్ల ప్రింటింగ్ కోసం ఏకంగా రూ.13 వేల కోట్లు ఖర్చయ్యాయి.

ఈ వాస్తవలన్నీ జనాలకు తెలిసి సోషల్ మీడియాలో మోడీ సర్కారుపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడుస్తోంది. ఇందుకోసం ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ టైటిల్‌నే వాడుకుంటున్నారు. థగ్స్ అంటే దొంగలు అని అర్థం. రెండేళ్ల కిందట నరేంద్ర మోడీ.. అరుణ్ జైట్లీ.. ఇతర ఎన్డీయే సర్కారులోని దొంగలంతా కలిసి డీమానిటైజేషన్ అనే పనికి మాలిన నిర్ణయం తీసుకున్నారని.. జనాల జేబుల్ని గుల్ల చేయడం తప్ప వీళ్లు చేసిందేమీ లేదని.. డీమానిటైజేషన్ రెండో వార్షికోత్సవం రోజు మోడీ బృందానికి సరిగ్గా సరిపోయే టైటిల్‌తో సినిమా వచ్చిందని పేర్కొంటూ జనాలు విమర్శలు గుప్పిస్తున్నారు. ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ అనే హ్యాష్ ట్యాగ్ కొడితే ఆ సినిమాకు సంబంధించిన విశేషాలతో పాటు మోడీ సర్కారుపై విమర్శలు  కూడా పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English