చంద్రబాబును ఇరికిద్దామ‌ని చూసి...!

చంద్రబాబును ఇరికిద్దామ‌ని చూసి...!

అంద‌రి ఐడియాలు అన్నిసార్లు పేల‌వు. చేదు అనుభ‌వాలు ఎవ‌రికైనా త‌ప్ప‌వు. ఈరోజు ఇంట‌ర్నెట్‌లో అలాంటి సంఘ‌ట‌నే జ‌రిగింది. నోట్ల ర‌ద్దు ప్ర‌కట‌న చేసిన‌పుడు *చ‌రిత్రాత్మ‌క నిర్ణ‌యం* అని చంద్ర‌బాబు మోడీ నిర్ణ‌యాన్ని పొగిడిన క్లిప్లింగుల‌ను అంద‌రూ షేర్ చేశారు. అయితే, వీటిని షేర్ చేసింది చంద్ర‌బాబు వ్య‌తిరేకులు. బాబు ద్వంద విధానంపై దాడి చేయ‌డానికి ఆ క్లిప్పింగ్ వాడి ప‌ప్పులే కాలేశారు. నిజానికి బాబుకు అది ప్ల‌స్ అయ్యింది.

నోట్ల ర‌ద్దు సూప‌ర్ డెసిష‌న్ అని పొగిడిన వారు కూడా దాన్ని ఆ త‌ర్వాత తీవ్రంగా వ్య‌తిరేకించారు. న‌వంబ‌రు 8 నాటికి నోట్ల ర‌ద్దు చేసి  రెండు సంవ‌త్స‌రాలు అయిన సంద‌ర్భంగా మ‌ళ్లీ  సోష‌ల్ మీడియాలో అది వైర‌ల్ అయ్యింది. అనేక‌మంది వార్షికోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని మోడీ మీద దాడిచేశారు. ఆరోజు ఆ నిర్ణ‌యాన్ని స్వాగ‌తించిన చంద్ర‌బాబు ఇపుడు బీజేపీ మిత్ర పార్టీ కాక‌పోవ‌డంతో చంద్ర‌బాబును  ఇరికించ‌డానికి కొంద‌రు ఆ క్లిప్పింగును షేర్ చేసి వైర‌ల్ చేశారు. హెడ్డింగును చూసి చంద్ర‌బాబును బ్లేమ్ చేద్దామ‌ని షేర్ చేసిన ఆ క్లిప్పింగ్ కంటెంట్‌లో బాబు నోట్ల ర‌ద్దును పొగిడింది నిజ‌మే. కానీ అందులోని అస‌లు పాయింట్ మాత్రం చంద్ర‌బాబుకు అనుకూలంగానే ఉంది. దీంతో షేర్ చేసిన వారు నాలిక్క‌రుచుకున్నారు. కొంద‌రు కామెంట్లు చూసి డిలీట్ చేశారు.

ఇంత‌కీ ఆ రోజు బాబు ఏమ‌న్నారు?

*అక్ర‌మ సంపాద‌నను తేలిగ్గా దాచుకోవ‌డానికి రూ.1000, రూ.500 నోట్లు ఉప‌క‌రిస్తాయి. వీటి ర‌ద్దు వ‌ల్ల ఇక‌పై అటువంటి అవ‌కాశం ఉండ‌దు. చాచుకోవడానికి అవ‌కాశం ఉన్న‌కొద్దీ అక్ర‌మ‌సంపాద‌న విస్త‌రిస్తోంది. అటువంటి అవ‌కాశం త‌గ్గితే అక్ర‌మ‌సంపాద‌న‌, అవినీతి త‌గ్గుతుంది. రూ.1000 నోట్ల‌ను దాచి ర‌వాణా చేసినంత తేలిగ్గా రూ.100 నోట్ల‌ను దాచ‌లేరు, ర‌వాణా చేయ‌లేరు. అందుకే ఈ నోట్ల‌ను ర‌ద్దు చేయాల‌ని మేము చాలాకాలంగా పోరాడుతున్నాం* ఇది ఆ క్లిప్పింగ్‌లో ఉన్న చంద్ర‌బాబు మాట‌లు. నిజానికి ఈ విష‌యానికి ఇప్ప‌టికీ స్టిక్ అయి ఉన్నారు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు. అయితే, అనూహ్యంగా మోడీ ఏకంగా 2000 నోటు ప్ర‌వేశ‌పెట్ట‌డం ద్వారా ల‌క్ష్యానికి విరుద్ధంగా ప‌నిచేశారు. దీంతో బ్లాక్ మ‌నీకి ఆ నిర్ణ‌యం మ‌రింత తోడ్ప‌డింది. ఈ విష‌యంపై చంద్ర‌బాబు ఇటీవ‌ల కూడా స్పందించారు. మ‌ళ్లీ పెద్ద నోట్లు తేవ‌డం ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో బ్లాక్ మ‌నీకి ప్రోత్సాహం ఇచ్చింద‌ని బాబు వ్యాఖ్యానించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English