అతను చెప్పినదాంట్లో నిజంగా తప్పుందా?

అతను చెప్పినదాంట్లో నిజంగా తప్పుందా?

రెండు రోజుల నుండి మనం భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కొహ్లీపై జరుగుతున్న ట్రాలింగ్ అంతా చూస్తూనే ఉన్నాం. అతను కూడా ట్రాలింగును లైట్ తీస్కున్నట్లే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే అప్పుడెప్పుడో ఎవరో చెత్త పాడేసిన విషయంలో కొహ్లీ ఓవర్ చేశాడేమో కాని.. ఈసారి మాత్రం అతను అన్నదాంట్లో నిజం ఉందనే అనిపిస్తోంది.

''ఈ ఇండియన్స్ కంటే ఆ ఇంగ్లాండ్ అండ్ ఆస్ట్రేలియా బ్యాట్స్ మ్యాన్లు బెటర్.. పైగా ఈ విరాట్ అయితే బాగా ఓవర్ రేటెడ్'' అన్నాడు ఒక నెటిజనుడు. మరి ఒక ఇండియన్ అయ్యుండి.. ఒక ప్రక్కన ఇండియా క్రికెట్లో చాలా దేశాల తుప్పు రేగ్గొడుతుంటే.. వరల్డ్ నెం.1 టెస్ట్ మరియు వన్డే బ్యాట్స్ మ్యాన్ గా విరాట్ కొహ్లీ.. నెం.1 వన్డే బౌలర్ గా జస్ప్రీత్ బూమ్రా.. ఐసిసి ర్యాంకులను శాసిస్తున్న టైములో.. ఇలా ఎవరన్నా ఇండియన్స్ వేస్ట్ అని కామెంట్ చేస్తే.. అది కరక్టేనంటారా? ఓ యాంగిల్లో చూస్తే అలా కామెంట్ చేయడం తప్పు.

మనకు ఐడెంటిటీ ఇచ్చిన దేశాన్నిమనం చెత్త దేశం అని తిట్టడం చాలా తప్పే. పోనివ్ మన క్రికెటర్లు నిజంగానే చెత్త ప్లేయర్స్.. వాళ్ళకు అస్సలు ఆటే రాదు.. వాళ్ళు ఇంకా నేర్చుకోవాలి అని ఫీలై ఎవరన్నా రెచ్చగొట్టడానికి అని చెప్పారులే అనుకుంటే.. మనోళ్లు ఎంత సత్తా ఉన్నోళ్ళో మనకు తెలుసు. మరి విరాట్ సైడ్ ఈసారి కాస్తన్న న్యాయం ఉన్నట్లే. కాదంటారా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English