మీ అబ‌ద్ధాలు కాస్త గుర్తుంచుకోండి కేటీఆర్ !

మీ అబ‌ద్ధాలు కాస్త గుర్తుంచుకోండి కేటీఆర్ !

చంద్ర‌బాబు చెప్పింది చేయ‌డు, గుంట న‌క్క అంటారా.. మీరు ఎదుటి వారిని మాట్లాడే ముందు మీ గురించి ఒక నిమిషం ఆలోచించుకోవాలి కేటీఆర్ అంటూ తెలుగుదేశం జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రేవూరి ప్ర‌కాష్‌రెడ్డి కేటీఆర్‌ను విమ‌ర్శించారు. బూతులు మాట్లాడ‌టం ద్వారా తెలంగాణ సంస్కృతి అంటే బూతులు మాట్లాడ‌టం అని తెలంగాణ‌ను అవ‌మానించి మీ నాన్న‌, నువ్వు. పెద్ద వాళ్ల‌ను గౌర‌వించ‌ని తెలియ‌ని మీకు ప్ర‌జ‌ల‌ను గౌరవించ‌డం ఎలా వ‌స్తుంది? అని ప్ర‌కాష్‌రెడ్డి కేటీఆర్ పై విరుచుకుప‌డ్డారు.

ఓట్ల కోసం దిగ‌జారి మాట్లాడే సంస్కారం మీకు పుట్ట‌క‌తో వ‌చ్చింద‌ని, చంద్ర‌బాబు ఎపుడూ సంస్కార‌వంతంగా మాట్లాడ‌తార‌ని ప్ర‌కాష్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్, కేటీఆర్ మొద‌టి నుంచి తెలంగాణ ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నారు. హ‌రీష్‌ను కూడా మీరు మోసం చేశారు. పార్టీ పెట్టిన‌ప్ప‌టి నుంచి ఉద్య‌మంలో ఉన్న‌ది హ‌రీష్. కేసీఆర్ రాజ‌కీయ వార‌సుడు హ‌రీష్ అవ్వాలి గాని కేటీఆర్ ఎట్లా అవుతాడు అని ప్ర‌కాష్‌రెడ్డి ప్ర‌శ్నించారు.  

మీరు చెప్పిన అబ‌ద్ధాల లిస్టు ఇది
* ద‌ళితుడిని ముఖ్య‌మంత్రిని చేయ‌డం
* కేజీ నుంచి పీజీ వ‌ర‌కు ఉచిత విద్య‌
* అంద‌రికీ డ‌బుల్ బెడ్‌రూం ఇళ్లు
* హైద‌రాబాదులోనే ల‌క్ష ఇళ్లు
* నీళ్లివ్వ‌కుంటే ఓట్లు అడ‌గ‌ను..

ఇవి మీ నాన్న చెప్పిన అబ‌ద్ధాలు కాదా,  ప్ర‌జ‌ల‌ను ఎన్నిక‌ల‌కు ముందే ఇవ‌న్నీ ఇస్తాన‌ని మీ నాన్న చెప్ప‌లేదా? అని రేవూరి ప్ర‌కాష్ రెడ్డి కేటీఆర్‌ను నిల‌దీశారు. టీఆర్ఎస్ కోసం హరీశ్ రావు అహర్నిశలు కష్టపడ్డారు. అత‌నికి  మీరు ఇప్పుడు వెన్నుపోటు పొడుస్తున్నారు. హరీశ్ రావును వారసుడిగా ప్రకటించే దమ్ము, ధైర్యం కేసీఆర్ కు ఉన్నాయా? అస‌లు మీరు రాజ్యాంగేతర శక్తిగా ఎలా అవ‌త‌రించారో ఎవ‌రికి తెలియ‌దు అని  రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. అన్ని శాఖ‌ల‌కు కేటీఆరే మంత్రి ... ఇది తెలంగాణ దుస్థితి అని ఆయ‌న అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English