కేసీఆర్‌కు భ‌లే ఐడియా వ‌చ్చిందే!

కేసీఆర్‌కు భ‌లే ఐడియా వ‌చ్చిందే!

ఎదుటి బ‌ల‌హీన‌త తెలుసుకోవ‌డం మంచి క‌ళే గాని... మ‌న బ‌ల‌హీన‌త‌లు మ‌న‌కు తెలిసి ఉండ‌టం అంత‌క‌న్నా ఉప‌యోగ‌క‌రం. ఈసారి ఈ విష‌యంలో కేసీఆర్‌కు ఒక సూప‌ర్ ఐడియా వ‌చ్చింది. సాధార‌ణంగా... తెలంగాణలో చాలా మంది బ‌డాబ‌డా నేత‌లు, ఓట్ల నాడి ప‌ట్టిన కాక‌లు తీరిన అభ్య‌ర్థులు నామినేష‌న్ ప‌త్రాలు నింపేట‌పుడు చిన్న‌చిన్న విష‌యాలు వ‌ద్ద త‌ప్పులు చేసి కొంప‌లుముంచుకుంటున్నారు. గ‌తంలో ఇలాంటి సంఘ‌ట‌న‌లు చాలా జ‌రిగాయి. ఇది ఎంత విచిత్ర‌మైన స‌మస్య అంటే... అన్నీ ఉండి అల్లుడి నోట్లో శ‌ని అంటారుగా అలాంటిద‌న్న‌మాట‌. చివ‌ర‌కు గ‌త త‌మిళ‌నాడు ఉప ఎన్నిక‌ల్లో హీరో విశాల్ కూడా ఈ అనుభ‌వాన్ని ఎదుర్కొన్నారు.

ఈ విష‌యాన్ని కేసీఆర్ ప‌సిగ‌ట్టాడు. అస‌లే ముహుర్తాలు చాలా సీరియ‌స్‌గా ప‌ట్టించుకునే కేసీఆర్ అనుకున్న టైంలో ప‌క్కాగా నామినేష‌న్ ప‌డాల‌ని అంద‌రికీ ముహుర్తాలు పెట్టారు. ఈ సంద‌ర్భంగా నామినేష‌న్ ప‌త్రాల్లో ఏ పొర‌పాటు జ‌ర‌గ‌డ‌కూద‌ని డిసైడ్ అయ్యారు. అయితే, చాలా మంది నేత‌ల‌కు, చదువుకున్న వారు కూడా ఎన్నిక‌ల నామినేష‌న్ ప‌త్రం నింప‌డంలో ఫెయిల‌వుతుంటారు. అందుకే ఆ విష‌యంలో బొక్క‌బోర్లా ప‌డ‌కుండా కేసీఆర్ కు ఒక ఆలోచ‌న వ‌చ్చింది. రాష్ట్రంలో టీఆర్ఎస్ పోటీ చేసే ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌తి అభ్య‌ర్థి వెంట ఒక లాయ‌ర్ ను పెట్టాల‌ని డిసైడ్ చేసింది.
 
ఈ విష‌యంపై తాజాగా టీఆర్ఎస్ నేతలకు ఈ రోజు పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. మీరు ఇష్టాను సారం వ్య‌వ‌హ‌రించ‌కండి. పార్టీ నియ‌మించిన లాయ‌ర్ మాట వినండి అంటూ వారికి సూచించారు. అంద‌రు అభ్య‌ర్థుల‌కు ఈ నెల 11న పార్టీ అధిష్ఠానం  బీ-ఫారాలను ఇవ్వ‌నుంది. అదే రోజు మిగిలిన 12 నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్ర‌క‌టిస్తార‌ట‌. మొత్తానికి అడుగడుగునా కేసీఆర్ జాత‌కాల‌తో పాటు త‌మ అభ్య‌ర్థుల మ‌న‌సుల‌ను కూడా ఫాలో అవుతున్నాడు. నిజానికి ఈ ఐడియా టీడీపీలో ఉన్న‌పుడు కేసీఆర్ నేర్చుకున్న‌ది. కాకపోతే కేసీఆర్ దానిని పార్టీ త‌ర‌ఫున ఏక‌మొత్తంగా అమ‌లు చేస్తున్నాడు. అంతే తేడా!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English