చెడగొట్టడంలోని ఆనందం

చెడగొట్టడంలోని ఆనందం

తాను చెడినందుకు కాదు, ప్రత్యర్థిని చెడగొట్టినందుకు సంతోషించేవాడు రాజకీయ నాయకుడు. దానికి పెర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌ కర్నాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప. భారతీయ జనతా పార్టీ నుంచి బయటకు వెళ్ళి కర్నాటక జనతా పార్టీ పెట్టిన యడ్యూరప్ప ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూశారు. కాని, తాను గెలిచినట్టుగా సంబరపడుతున్నారాయన.

"నేను బీజేపీలో లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఆ పార్టీ నేతలకు చూపించా.. బీజేపీని రాష్ట్రంలో సంపూర్ణంగా మట్టికరిపించా.." అని కేజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప అన్నారు. ఇటీవల ముగిసిన విధానసభ ఎన్నికల్లో 110 నియోజక వర్గాల్లో బీజేపీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయి పార్టీ ఘోరంగా ఓడిరదని, దీనికి తానే కారణమని తెలిపారు. యడ్యూరప్ప పార్టీ మట్టికరిచినందుకు ఆయన నైతికంగా కుంగిపోవాలి.

కాని బిజెపిని ఓడిరచడం ద్వారా ఆయన గెలిచానని అనుకుంటున్నారు. చెడగొట్టడంలో ఆనందమేమిటో యడ్యూరప్పని అడిగితే సరి అర్థమయ్యేలా చెప్తారాయన.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు