ఎస్‌... చంద్ర‌బాబుది రాజ‌కీయయే!

ఎస్‌... చంద్ర‌బాబుది రాజ‌కీయయే!

రాజ‌కీయం ఈనాటిది కాదు. చాణ‌క్యుడు వేల ఏళ్ల క్రితం చెప్పిన రాజ‌కీయ నీతి ఇంకా మ‌న‌కు ప‌నికివ‌స్తూనే ఉంది. రాజ‌కీయం లేకుండా అధికారం చేజిక్కుంచుకోవ‌డం, దాన్ని నిల‌బెట్టుకోవ‌డం అంత సులువు కాదు. చంద్ర‌బాబు ఆధునిక చాణ‌క్యుడు. రాజ‌కీయం చేయ‌డంలో ఆయ‌న స్టూడెంట్‌గా ఉన్నప్ప‌టి నుంచే మొద‌లుపెట్టారు. అందుకే అత‌ని వ్యూహాలు చూస్తూ ఆశ్చ‌ర్య‌పోవ‌డ‌మే గాని...తెలుగు రాష్ట్రాల్లో ఆయ‌న పై ఎత్తుల‌ను అంత సులువుగా గెస్ చేయ‌లేక‌పోతున్నారు.
 
ఈ సంద‌ర్భంగా కొన్ని ఉదాహ‌ర‌ణ‌లు గుర్తుచేసుకుంటే చంద్ర‌బాబు వ్యూహ‌చ‌తుర‌త అర్థ‌మ‌వుతుంది. వాటిని చూద్దాం.

* చంద్రబాబునాయుడు విద్యార్థిగా ఉన్న‌పుడే రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. ఎత్తుకు పైఎత్తులు వేయ‌డంలో దిట్ట. ఎస్వీ యూనివ‌ర్సిటీలో విద్యార్థి సంఘం ఎన్నిక‌లు జ‌రుగుతున్న రోజుల‌వి. ఆ ఎన్నికల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హ‌వా న‌డుస్తోంది. వారికి పోటీగా నిల‌బ‌డి తానొక్క‌డే గెల‌వ‌లేడు. అందుకే ఆ వర్గం నెగ్గకుండా బీసీల కూటమిని ప్రోత్సహించి వారికి అండ‌గా నిల‌బ‌డ్డారు. ఆ పొలిటికల్ ఎలయన్స్ లో పెద్దిరెడ్డి వ‌ర్గాన్ని ఓడించారు. మ‌నం గెల‌వ‌లేన‌పుడు ప్ర‌త్య‌ర్థిని ఓడించ‌డ‌మే రాజ‌కీయం. బ‌హుశా తెలంగాణ‌లో, రాబోయే లోక్‌స‌భ‌లో బాబు వ్యూహం ఇదే.

*  1980లలో కాంగ్రెసు పార్టీలో చంద్ర‌బాబు ఇంకా బ‌ల‌ప‌డ‌లేదు. మ‌రో వర్గం మనిషిని జెడ్పీ ఛైర్మన్ గా బ‌రిలో ఉన్నాడు. అపుడు తన వర్గం అభ్యర్థి కుతూహలమ్మను క్రాస్ ఓటింగ్‌తో బాబు గెలిపించుకున్నారు. దీంతో కాంగ్రెసు అధిష్టానం షాక్ తిన్న‌ది.

* మ‌రో సంద‌ర్భం కాంగ్రెస్ పాల‌న‌లోనిది. చంద్ర‌బాబు మంత్రిగా ఉన్నారు. ఏదో కార‌ణంతో కాంగ్రెసు అధిష్టానం బాబును సస్పెండ్ చేసింది. కేవ‌లం 24 గంట‌ల్లో ఢిల్లీ చ‌క్రం తిప్పి మ‌ళ్లీ మంత్రిగా కొన‌సాగారు.

బాబు వ్యూహ‌ర‌చ‌నకు కొన్ని ఉదాహ‌ర‌ణ‌లు ఇవి. కేవ‌లం ఏపీలో -తెలంగాణ‌లో జ‌న‌సేన‌, ,టీఆర్ఎస్‌, వైసీపీ బీజేపీతో ఉన్నాయ‌ని చెప్పినంత మాత్రాన వారి అంత‌ర్గ‌త ఒప్పందాల గురించి చంద్ర‌బాబు న‌మ్మించ‌లేరు. అందుకే బ‌హ‌ళ ప్ర‌యోజ‌కారి అయిన ఓ వ్యూహాన్ని ప‌న్నారు. బీజేపీ వ్య‌తిరేక కూట‌మి. ఆ పేరులోనే చంద్ర‌బాబు చ‌తుర‌త ఉంది. ఎందుకంటే అది కాంగ్రెస్ కూట‌మి అనే ముద్ర ప‌డితే చాలామంది ప్ర‌జ‌లు దూర‌మ‌వుతారు. థ‌ర్డ్ ఫ్రంట్ అయితే... నాయ‌కులు దూర‌మ‌వుతారు. దేశంలో మోడీపై ప్ర‌జ‌ల్లో ఉన్న కోపం త‌మ కూటమికి ఓట్లుగా మారాలంటే... అది *బీజేపీ వ్య‌తిరేక కూట‌మి* అనే పేరు వ‌ల్లే సాధ్యం. అందుకే చంద్ర‌బాబు ఆ వ్యూహంతో వెళ్లారు.

మ‌రోవైపు కాంగ్రెస్‌తో పాటు జాతీయ స్థాయిలో బీజేపీ త‌ప్ప అన్ని పార్టీలతో ఇపుడు చంద్ర‌బాబుకు అల‌యెన్స్ ఉన్న‌ట్లే. అంటే దాని అర్థం ఏంటి? టీఆర్ఎస్-జ‌న‌సేన‌-వైసీపీకి మిగిలిన ఏకైక ఆప్ష‌న్ బీజేపీ. వీళ్లు చంద్ర‌బాబును శ‌త్రువులుగా భావిస్తున్నారు కాబ‌ట్టి... చంద్రబాబు కూట‌మి కాకుండా మిగిలిన ఏకైక అవ‌కాశం బీజేపీయే. అంటే వీరంతా క‌చ్చితంగా బీజేపీతో జాతీయ స్థాయిలో క‌ల‌వ‌డం త‌ప్ప‌వేరే అవ‌కాశ‌మే లేదు. ఇపుడు వీరిపై బీజేపీ ముద్ర‌ను నిజం చేయ‌డం చాలా ఈజీ. ఈ స్థాయిలో ఉంటుంది చంద్ర‌బాబుది రాజ‌కీయం. చ అంటే చంద్ర‌బాబు. చా అంటే చాణ‌క్యుడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English