అఫిషియ‌ల్‌- టీడీపీకి 14, కాంగ్రెస్‌కు 95 !

అఫిషియ‌ల్‌- టీడీపీకి 14, కాంగ్రెస్‌కు 95 !

టీడీపీ కాంగ్రెస్ పొత్తు అధికారికంగా క‌న్‌ఫం అయ్యింది. తెలంగాణ‌లో కొత్త రాజ‌కీయ పొత్తు అధికారికంగా పొడిచింది. డిసెంబ‌రు 7న జ‌ర‌గ‌బోయే తెలంగాణ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీకి పొత్తులో భాగంగా 14 సీట్లు కాంగ్రెస్‌ కేటాయించింది. ఇందులో పెద్ద ట్విస్ట్ ఏమీలేదు. కానీ కాంగ్రెస్ 95 సీట్ల‌లో పోటీ చేయ‌నుండ‌టం పెద్ద ట్విస్ట్‌గా ఉంది. ఇంత‌వ‌ర‌కు కాంగ్రెస్ 90 స్థానాల‌కు ప‌రిమితం అవుతుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతూ వ‌స్తున్న నేప‌థ్యంలో కాంగ్రెస్ 95 స్థానాల్లో పోటీకి త‌యార‌వ‌డం కొత్త రాజ‌కీయ అనుమానాల‌కు తావిచ్చింది.

ప్ర‌స్తుతం కోదండ‌రాం పార్టీ తెలంగాణ జ‌న‌స‌మితి కాంగ్రెస్ ను పెద్ద సంఖ్య‌లో టిక్కెట్లు అడుగుతోంది. 40 నుంచి మెల్ల‌మెల్ల‌గా దిగి ప‌ది సీట్ల దాకా వ‌చ్చారు. కానీ తాజాగా వ‌చ్చిన ప్ర‌క‌ట‌న చూస్తే 10 సీట్లు తెలంగాణ జ‌న‌స‌మితికి వ‌చ్చే అవ‌కాశమే లేదు. ఒక‌వేళ అదే నిజ‌మైతే సీపీఐ పొత్తులో లేన‌ట్లే అనుకోవాలి. 95+14 = 109 అవుతాయి.

కోదండ‌రాం ప‌ది సీట్లు తీసుకుంటే 119. అంటే స‌రిగ్గా తెలంగాణ లోని నియోజ‌క‌వ‌ర్గాల సంఖ్య‌. ఒక‌వేళ ఆ రెండు పార్టీలు కూడా ఉన్నాయంటే... 5+5 సీట్లు చొప్పున పంచుతారు. మ‌రి దానికి కోదండరాం ఒప్పుకుంటారా అన్న అనుమానం ఉంది. సీపీఐ కూడా ఆరేడు సీట్లు కావాలంటోంది. ఇవ‌న్నీ గ‌మ‌నిస్తుంటే... తెలంగాణ జ‌న స‌మితి ఎన్నిక‌ల‌కు ముందే కాంగ్రెస్లో విలీనం చేసే ప్ర‌తిపాద‌న ఏమైనా ఉందా అన్న అనుమానం కూడా వ‌స్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English