చంద్ర‌బాబు ఐడియా కాంగ్రెస్‌కు తెగ న‌చ్చింది!

చంద్ర‌బాబు ఐడియా కాంగ్రెస్‌కు తెగ న‌చ్చింది!

పొత్తు. ఇది రాజ‌కీయంలో చాలా ఇంపార్టెంట్ డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ సూత్రం. ఒక పార్టీ ఇబ్బందిక‌రమైన ప‌రిస్థితుల్లో ఉన్న‌పుడు అది మ‌రింత‌గా బ‌ల‌ప‌డ‌డానికి ఇది చాలా అవ‌స‌రం. ఎపుడో ఒక‌సారి పొత్తు అనేది లేకుండా ఇంత‌వ‌ర‌కూ ఏ పార్టీ మ‌న‌లేదు. కొన్ని ర‌హ‌స్య పొత్తులుంటాయి. ఇంకొన్ని బ‌హిరంగ పొత్తులుంటాయి.

ప్ర‌స్తుతం తెలంగాణ కాంగ్రెస్ - టీటీడీపీ సంయుక్తంగా పొత్తు పెట్టుకుని ఎన్నిక‌ల‌కు పోతున్నాయి. అయితే, ఇక్క‌డే అస‌లు చిక్కు వ‌చ్చి ప‌డింది. ఒకపుడు తెలంగాణ‌ను ఏలిన పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వాలి? అయితే, కాంగ్రెస్ తీవ్ర సందిగ్ధంలో ఏం తేల్చుకోలేక‌పోతుంటే చంద్ర‌బాబు ఒక బ్ర‌హ్మాండ‌మైన ఐడియా ఇచ్చార‌ట‌. ఆ ఐడియాతో మ‌హాకూట‌మికి నాయ‌క‌త్వం వ‌హిస్తున్న కాంగ్రెస్ తెగ ఆనందప‌డింద‌ట‌. ఇంత‌కీ చంద్ర‌బాబు ఇచ్చిన ఆ ఐడియా ఏంటి?

పాలిటిక్స్‌లో నిల‌వాలంటే.. మ‌నం ఎక్క‌డ బ‌లంగా ఉన్నామో కాదు, ఎక్క‌డ బ‌ల‌హీనంగా ఉన్నామో గుర్తించాలి. అందుకే ముందు పార్టీని నిల‌బెట్టే ల‌క్ష్యంతో కాంగ్రెస్‌తో పొత్తుకు వెళ్లారు చంద్ర‌బాబు. అంటే అధికారం అస‌లు ల‌క్ష్య‌మే కాన‌పుడు అటో ఇటో ప‌ట్టువిడుపు వ‌ల్ల మ‌న‌కే లాభం అని డిసైడ్ అయ్యారు. అందుకే నేలవిడిచి సాము చేయలేదు. గతంలో టీడీపీ సాధించిన సీట్ల సంఖ్యకు సమానంగా కేటాయిస్తే చాలని చెప్ప‌డంతో పాటు... పంప‌కానికి కూడా బాబు స‌ల‌హా ఇచ్చారు.

సీట్ల విషయంలో అయోమ‌యానికి గురికాకుండా జాతీయంగా రెప్యుటేష‌న్ ఉన్న‌ తటస్థ సంస్థకు బాధ్యతలు అప్పగించి ఓ స‌ర్వే చేయించాల‌ని సూచించింది. ఆ సర్వేలో కాంగ్రెసు కంటే టీడీపీకి ఆదరణ ఎక్కువగా ఉన్న సీట్లను త‌మ‌కు కేటాయిస్తే చాల‌నేది చంద్ర‌బాబు ఐడియా. నిజానికి ఇది ఉభ‌య‌తార‌కంగా ఉంది. ఈ స‌ర్వే టీడీపీ సూచించిన 30 నియోజకవర్గాలలో చేస్తారు. వాటిలో బ‌లంగా ఉన్న‌ 15 స్థానాలు టీడీపీకి కేటాయిస్తారు. ఈ ఐడియాతో కాంగ్రెస్ చాలా హ్యాపీగా ఫీల‌యింద‌ట‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English