బిగ్ న్యూస్ - ల‌గ‌డ‌పాటి రీఎంట్రీ

బిగ్ న్యూస్ - ల‌గ‌డ‌పాటి రీఎంట్రీ

రాజ‌కీయాల్లో ల‌గ‌డ‌పాటిది భిన్న‌మైన శైలి. ఆయ‌న తెలియ‌న వారు తెలుగు రాష్ట్రాల్లో లేరు. విభ‌జ‌న‌ను అడ్డుకోవ‌డానికి పూర్తి స్థాయిలో ప్ర‌య‌త్నించిన వ్య‌క్తిగా అత‌నిపై ఆంధ్రుల్లో ఒక ముద్ర ఉంది. తెలంగాణ వాదులు కూడా అప్ప‌ట్లో ల‌గ‌డ‌పాటిని వ్య‌తిరేకించినంత వేరే ఆంధ్రులు ఎవ్వ‌రినీ వ్య‌తిరేకించ‌లేదు. అయితే, అప్ప‌ట్లో విభ‌జను క‌చ్చితంగా అడ్డుకుంటాను, విభ‌జ‌న అనేది జ‌రిగితే రాజ‌కీయాల్లో ఉండ‌ను అని ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ అప్ప‌ట్లో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఆయ‌న ప్ర‌య‌త్నం చేశాడు కానీ... అవేమీ కూడా విభ‌జ‌న‌ను ఆప‌లేక‌పోయాయి. క‌ట్ చేస్తే... ఇపుడు అదే తెలంగాణ రాజ‌కీయం మీద ఆయ‌న ఆస‌క్తి చూప‌డం వైర‌ల్ అవుతోంది.

ఈ సాయంత్రం త‌న పొలిటిక‌ల్ రీ ఎంట్రీపై ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ స్పందించారు. తాను రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అయితే, ట్విస్టు కూడా ఇచ్చారు. తాను ఎమ్మెల్యేగా పోటీ చేయ‌డానికి ఆస‌క్తి చూప‌డం లేద‌ని, కేవ‌లం ఎంపీగానే మ‌ళ్లీ పోటీ చేస్తాను అన్నారు. కానీ ఆంధ్రలో పోటీ చేయ‌డానికి ఆయ‌న ఆస‌క్తి చూపక‌పోవ‌డం విస్మ‌యం. తెలంగాణ నుంచే లోక్‌స‌భ‌కు త‌న‌కు అవ‌కాశ‌మొస్తే ఎంపీగా పోటీ చేస్తాను అని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. జ‌గ‌న్ గురించి కూడా ఆయ‌న స్పందించారు. విశాఖ విమానాశ్రయంలో జగన్‌పై దాడిని ల‌గ‌డ‌పాటి ఖండించారు. ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత సహా ఎవరిపై దాడి జరిగినా ఖండించాల్సిందేనని, హ‌త్య‌లు, దాడులకు కాలం చెల్లింద‌న్నారు.

పరిస్థితులను బట్టి రాజకీయాల్లో పొత్తులు త‌ప్ప‌వ‌ని, బీహార్‌లో బద్ధ విరోధులు కూడా కలిశారని గుర్తు చేశారు. మహాకూటమిలో సీట్ల సర్దుబాటు, టికెట్ల పంపిణీ, ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీచేస్తారు అనే విష‌యం తెలిశాక‌... విజ‌యావ‌కాశాల‌పై ఒక క్లారిటీ వ‌స్తుంద‌న్నారు. అన్నీ తేలాక‌ ప్రజల నాడిపై స‌ర్వే చేస్తాన‌ని... డిసెంబర్ 7 పోలింగ్‌ తర్వాత సర్వే ఫలితాలు వెల్లడిస్తానని అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English