అవిశ్వాసం.. ఆ విశ్వాసం కాంగ్రెసుదే

అవిశ్వాసం.. ఆ విశ్వాసం కాంగ్రెసుదే

వచ్చే శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ఎవరు పెట్టినా ఎదుర్కొనేందుకు సిద్ధమని చీఫ్‌ విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి చెప్పారు. అసెంబ్లీ వేదికగా విపక్షాలకు ధీటుగా సమాధానం చెప్పగలమన్నారాయన. విపక్షాలకు ప్రజల సమస్యలపై అవగాహన లేదని, అందుకే విపక్షాలను ప్రజలు విశ్వసించడంలేదన్నారు గండ్ర.

టిడిపి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ తమ దృష్టిలో సమమేనని, ఎవరితోనూ తాము కుమ్మక్కు కావడంలేదని గండ్ర వివరించారు. తెలుగుదేశం పార్టీ అవిశ్వాసం పెట్టినా దాన్ని ఎదుర్కొనే సత్తా తమకుందని గండ్ర చెప్పారు. సంక్షేమ పథకాలను వైఎస్‌ హయాంలో కంటే మెరుగ్గా అమలుచేస్తున్నప్పటికీ వైకాపా నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు.

టిడిపి నేతలు ప్రభుత్వంపై బురద చల్లి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రాంత ఎంపీలు పార్టీని వీడుతారని తాననుకోవడంలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు గండ్ర. నిర్ణీత గడువులోగా తెలంగాణపై అధిష్ఠానం సానుకూల నిర్ణయం ప్రకటిస్తుందని గండ్ర అభిప్రాయపడ్డారు.

 

TAGS