నేను సీఎం కావాలి అందుకే చండీయాగం చేస్తున్నా

నేను సీఎం కావాలి అందుకే చండీయాగం చేస్తున్నా

కాంగ్రెస్ నేత‌ల కుర్చీ ఆరాటంపై, ప్ర‌ధానంగా ముఖ్య‌మైన పీఠం గురించి వారి ఆలోచ‌న‌పై ఎన్నో సెటైర్లు, ఇంకెన్నో కామెంట్లు చ‌ర్చ‌ల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ముఖ్య‌మంత్రి పీఠంపై క‌న్నేసిన నేత‌ల జాబితా తీస్తే...చాంతాడంత ఉంటుందంటారు. అప‌ద్ధ‌ర్మ స‌ర్కాకు నాయ‌క‌త్వం వ‌హిస్తున్న టీఆర్ఎస్ పార్టీ అయితే దీనిపై సెటైర్లే వేస్తోంది. `కాంగ్రెస్ పార్టీలో నాయ‌కుల కంటే సీఎం అభ్య‌ర్థులే ఎక్కువ‌` అనేది వారి సెటైర్. అయిన‌ప్ప‌టికీ, ఆ పార్టీ నేత‌ల తీరు మార‌డం లేద‌న్న‌ది తాజాగా చేస్తున్న కామెంట్. మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్‌రెడ్డి తాజ‌గా ఈ త‌ర‌హా సెటైర్ల‌కు మ‌రింత ఆజ్యం పోశారు.

గ‌త కొద్దికాలంగా ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్న రాంరెడ్డిదామోద‌ర్ రెడ్డి తాజాగా అనూహ్య వార్త‌తో తెర‌మీద‌కు వ‌చ్చారు. సూర్యాపేటలోని తన స్వగృహంలో విజయ చండీయాగం నిర్వహిస్తున్నారు. సూర్యాపేట నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ... దామోదర్ రెడ్డి ఈ చండీ యాగాన్ని మూడు రోజులు నిర్వహించనున్నారు. అందులో భాగంగా ఇవాళ గణపతి పూజతో ప్రారంభోత్సవం చేసి చండీయాగం నిర్వహించనున్నారు. అయితే, ఈ యాగం ఫలం విష‌యంలో ఆయ‌న పూర్తి క్లారిటీగా ఉండ‌టం గ‌మ‌నార్హం. రాబోయే ఎన్నిక‌ల్లో సూర్యాపేట నుంచి కాంగ్రెస్ శాసనసభ్యుడిగా విజయం సాధించాలని... రాష్ట్ర కేబినెట్‌లో మంత్రి లేక ముఖ్యమంత్రి పదవి యోగం దక్కాలని కాంక్షిస్తూ ఆయన ఈ యాగాన్ని ప్రారంభించాన‌ని ఏకంగా క‌ర‌ప‌త్రాల రూపంలో ఆహ్వాన ప‌త్రిక‌లు ముద్రించారు. ఇలాంటి ఆహ్వానం , యాగం సో స్పెష‌ల్ అని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English