అమిత్‌షాకు అదిరిపోయే కౌంట‌ర్ ఇచ్చిన కేటీఆర్

అమిత్‌షాకు అదిరిపోయే కౌంట‌ర్ ఇచ్చిన కేటీఆర్

ముంద‌స్తు ఎన్నిక‌ల పోలింగ్ తేదీ ద‌గ్గ‌ర‌ప‌డుతున్నకొద్ది తెలంగాణ‌లో రాజ‌కీయం హాట్ హాట్‌గా మారుతోంది. ఏ పార్టీకి ఆ పార్టీ వ్యూహప్ర‌తివ్యూహాలు ర‌చిస్తున్నాయి. తాజాగా, తెలంగాణ బీజేపీ ఉలిక్కిప‌డే ప‌రిణామం చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస రెడ్డి పార్టీని వీడారు. చిత్రంగా ఇటీవలే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బహిరంగసభ నిర్వహించిన సంగతి తెలిసిందే. సభ విజయవంతమైందని..కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపిందని పార్టీ నేతలు భావించారు. కానీ వారి ఆనందం కొన్ని రోజులే నిలిచింది. ఈ జంపింగ్ జ‌రిగింది. ఈ ఆప‌రేష‌న్‌కు నాయ‌క‌త్వం వ‌హించింది తెలంగాణ  ముఖ్య‌మంత్రి త‌న‌యుడు కేటీఆర్ కావ‌డం విశేషం.

కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలోని కొంతమంది నేతలు పార్టీని వీడిన సంగతి తెలిసిందే. అయితే, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బహిరంగసభతో ఆ పార్టీ కొద్దిగా పుంజుకుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఇంత‌లోనే కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస రెడ్డి పార్టీని వీడారు. రాబోయే ఎన్నిక‌ల్లో భాగంగా హుస్నాబాద్ టికెట్ తనకివ్వకుండా వేరే వారికివ్వాలని బీజేపీ నేత‌లు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని భావించిన శ్రీ‌నివాస్ రెడ్డి దీనితో మనస్థాపానికి గురైన పార్టీని వీడాలని నిర్ణ‌యించుకొని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి లేఖ రాశారు. పార్టీని వీడిన కొత్త శ్రీనివాసరెడ్డి
కరీంనగర్ నుండి హైదరాబాద్‌కు చేరుకొని మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు.

దీంతో ఎన్నికల సమరం దగ్గర పడుతున్న కొద్దీ పార్టీకి చెందిన నేతలే బీజేపీ నాయ‌కుల‌కు షాక్‌లిస్తున్నారని అంటున్నారు. పార్టీ నుండి ఒక్కొక్కరూ వీడుతుండడం ఆ పార్టీ నేతలను కలవరానికి గురి చేస్తోందని పేర్కొంటున్నారు. అస‌లు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోందని చ‌ర్చించుకుంటున్నారు. టీఆర్ఎస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ కీలక నేతలను కలుసుకున్నారని తెలుస్తోంది. కాగా, నేతలు వెళ్లిపోయినా పార్టీకి నష్టం లేదని..ఇతరులు బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అవుతున్నారని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తుండ‌టం కొస‌మెరుపు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English