మావో 'మారణహోమం'

మావో 'మారణహోమం'

ప్రజల సమస్యలను తీర్చడానికి ప్రభుత్వంతో పోరాటం చేసే సాయుధ సైన్యమే మావోయిస్టులు / నక్సలైట్లు అని విన్నాం ఒకానొక కాలంలో. కాల క్రమేణా మావో ఉద్యమం అదుపు తప్పినది. ఆ యుద్ధం దేశం మీద చేస్తున్నారు మావోయిస్టులు. దేశ ప్రజాస్వామ్యాన్ని సవాల్‌ చేసేలా మావో యుద్ధం జరుగుతున్నది. ఈ యుద్ధం తాజాగా పెద్ద సంఖ్యలో ప్రాణాలను బలిగొంది.

సుకుమా బీజాపూర్‌ సరిహద్దులోని తోంగ్‌పాల్‌ వద్ద మావోయిస్టులు పెద్ద విధ్వంసమే సృష్టించారు. తోంపాలలో కాంగ్రెస్‌ పరివర్తన యాత్ర ముగించుకుని 10 కిలోవిూటర్ల దూరం రాగానే కాంగ్రెస్‌ నేతల కాన్వాయ్‌పై మూవోయిస్టులు మందుపాతర పేల్చారు. పేలుడు ధాటికి కాన్వాయ్‌లోని ఓ వాహనం తునాతునకలైంది. ఇంకో వాహనంలోని వారు తీవ్రంగా గాయపడ్డారు.

మందుపాతర పేలిన తర్వాత మావోయిస్టులు కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ దాడిని ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా కాంగ్రెసు అధినేత్రి సోనియాగాంధీ అభివర్ణించారు.  అటవీ ప్రాంతంలో జాతీయ రహదారిపై ఘటన జరగడంతో దాడి అనంతరం మావోయిస్టులు సులువుగా అక్కడి నుంచి తప్పించుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. కూంబింగ్‌ చర్యలు ముమ్మరం చేసిన పోలీసులు, మావోయిస్టుల వద్ద బందీగా ఉన్నవారిని విడిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నార్ట.

సల్వాజుడుం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మ సహా, 30 మంది ఈ మారణహోమంలో విగత జీవులైనట్లుగా సమాచారం అందుతున్నది.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు