ప్రియాంక గాంధీ కనబడుట లేదు..

ప్రియాంక గాంధీ కనబడుట లేదు..

కాంగ్రెస్ నాయ‌కురాలు  సోనియాగాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ అనూహ్య రీతిలో తెర‌మీద‌కు వ‌చ్చారు. ఆమెపై ఏకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. ప్రియాంక కనబడుట లేదని ఉత్తరప్రదేశ్‌లో పోస్టర్లు వెలిశాయి. ఆమె ఎమోషనల్ బ్లాక్ మెయిలర్ అని కరపత్రాలు పంచారు. రాయ్‌బరేలీ నియోజకవర్గంలోని త్రిపులా చౌరహ నుంచి హర్దాస్‌పూర్ ఏరియా వరకు పోస్టర్లను అతికించారు. ఈ పోస్టర్లపై యూపీలో రాజకీయ దుమారం రేగుతోంది. వచ్చే ఎన్నికల్లో సోనియా స్థానంలో రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ప్రియాంక రాయ్‌బరేలీ నియోజకవర్గానికి దూరంగా ఉండటంతో స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉంచాహర్ బాయిలర్ బ్లాస్ట్, హర్‌చందపూర్ రైల్వేప్రమాదం సమయంలోనూ ప్రియాంక.. రాయ్‌బరేలీకి రాలేదని.. దసరా ఉత్సవాలకు సైతం హాజరు కాలేదని స్థానికులు మండిపడుతున్నారు. 1980లో ఇందిరాగాంధీ ఈ నియోజకవర్గం నుంచి గెలిచారు. అప్పట్నుంచి రాయ్‌బరేలీ కాంగ్రెస్‌కు కంచుకోటగా మారింది. అయితే రాయ్‌బరేలీ, అమేథీ(రాహుల్ గాంధీ) నియోజకవర్గాలపై బీజేపీ దృష్టి సారించింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఎలాగైనా ఈ రెండు స్థానాల్లో బీజేపీని గెలిపించుకోవాలనే లక్ష్యంతో కమలనాథులు ఉన్నారు. రాయ్‌బరేలీ అభివృద్ధి కోసం ఇటీవల కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ రూ. 2 కోట్ల నిధులను ఎంపీ ల్యాడ్స్ కింద ప్రకటించారు. బీజేపీకి కౌంటర్‌గా కాంగ్రెస్ నాయకుడు కపిల్ సిబల్ కూడా అమేథికి రూ. 2 కోట్ల నిధులు ప్రకటించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English