నేడు మ‌ళ్లీ రేవంత్‌పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం

నేడు మ‌ళ్లీ రేవంత్‌పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం

తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి ఐటీ అధికారుల ఎదుట మరోసారి హాజరుకానున్నారు. బషీర్‌బాగ్‌లోని ఐటీ కార్యాలయంలో ఆయన్ను ఉదయం 10 గంటలకు విచారిస్తారు.  రేవంత్ రెడ్డి ఇంట్లో గత నెల సోదాల అనంతరం ఆయనకు నోటీసులు అందించిన అధికారులు.. ఈ నెల మూడో తేదీన ఐటీ కార్యాలయంలో విచారించారు. ఈనెల 23వ తేదీన మరోసారి తమముందుకు రావాలని ఆ సమయంలో ఆదేశాలు జారీ చేశారు. రేవంత్‌తోపాటు ఆయన అనుచరుడు ఉదయసింహ, మామ పద్మనాభ రెడ్డి, శ్రీ సాయి మౌర్య కంపెనీ డైరెక్టర్లు ప్రవీణ్ రెడ్డి, సురేష్ రెడ్డి, శివ రామిరెడ్డి, రామచంద్రారెడ్డిలు సైతం విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది.

ఆదాయానికి మించి ఆస్తులు కూడపెట్టారనే ఆరోపణలతో ఆదాయపుపన్ను శాఖ అధికారులు గ‌త నెల‌లో రేవంత్ నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన కంపెనీల్లో ఏకకాలంలో ఇవాళ్టి ఉదయం నుంచి సోదాలు జరుపుతున్నారు. జూబ్లీహిల్స్‌లోని రేవంత్ ఇంటితో పాటు, మరో 15 ప్రాంతాల్లో ఉదయం నుంచి తనిఖీలు చేశారు. ఐటీ శాఖతో పాటు, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల కూడా సోదాల్లో పాల్గొన్నారు. డీఆర్ఐ అధికారులు కూడా ఢిల్లీ నుంచి హైదరాబాద్ రానున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రేవంత్ రెడ్డి నివాసాలపై సోదాలు  రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. రేవంత్‌పై బ్లాక్ మనీ, ఇన్ కం ట్యాక్స్ చట్టం 2015, ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ చట్టం 2002, ప్రొహిబిషన్ ఆఫ్ బినామీ ట్రాన్సాక్షన్ ఆక్ట్ 1988, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 కింద కేసులు నమోదు చేశారు.

అయితే, దీనిపై వివాదాలు చెల‌రేగాయి. ఢిల్లీలోని మోడీ, గల్లీలోని కేసీఆర్‌ కుట్రలు పన్ని తన మీద, తన ఆస్తుల మీద దాడుల చేయిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. గతంలో తన బిడ్డ లగ్నపత్రిక రోజుకు ముందు కుట్రపన్ని అరెస్టు చేశారని.. ప్రస్తుతం మళ్లీ అదే పరిస్థితిని చవిచూస్తున్నానని రేవంత్‌ చెప్పారు. 'కేసీఆర్ నాకు ఇచ్చిన దానికి మిత్తితో సహా అప్పజెప్తానని తొడకొట్టి శపథం చేస్తున్నా..' అని రేవంత్‌రెడ్డి స‌వాల్ విసిరారు. తాజాగా జ‌రిగే విచార‌ణ‌లో ఆయ‌న ఎలా స్పందిస్తార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English