మీ మంత్రులేం చేశారయ్యా కిరణ్‌గారూ!

మీ మంత్రులేం చేశారయ్యా కిరణ్‌గారూ!

కర్నాటక ఎన్నికల ప్రచారానికి వెళ్ళారు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి. కాంగ్రెస్‌ పార్టీ వల్లనే అభివృద్ధి సాధ్యమని అక్కడ జరిగిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారాయన. ప్రచారానికి వెళ్ళాక తమ పార్టీకి అనుకూలంగా మాట్లాడ్డం తప్పు కాదు. కాని ఆయన ఓ విచిత్రమైన ప్రసంగం చేశారక్కడ. అవినీతికి పాల్పడ్డ మంత్రులు జైల్లో ఉన్నారని కర్నాటకలో అధికారంలో ఉన్న బిజెపిపై విమర్శలు చేశారు తన ప్రసంగంలో కిరణ్‌రెడ్డిగారు.

 ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నదేమిటి కిరణ్‌రెడ్డిగారూ అని అడగాల్సి ఉంటుంది. మోపిదేవి వెంకటరమణ ఎందుకు జైలుకు వెళ్ళారు? ఈయన కిరణ్‌ క్యాబినెట్‌లో పనిచేయలేదా? ధర్మాన ప్రసాదరావు మాటేమిటి, హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిస్థితి ఏమిటి? ఇవన్నీ ప్రశ్నలూ బిజెపి నుంచి దూసుకొస్తున్నాయ్‌. ఒక్క వేలిని ఎదుటివ్యక్తి వైపు చూపితే, నాలుగు వేళ్ళు మనవైపు చూపుతాయి. కిరణ్‌రెడ్డిగారికి ఇది బాగా సరిపోతుంది.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English