ఆంధ్రోళ్లు మోస్ట్‌ రెస్పెక్టెడ్‌ తెలంగాణ సిటిజన్స్

ఆంధ్రోళ్లు మోస్ట్‌ రెస్పెక్టెడ్‌ తెలంగాణ సిటిజన్స్

ఎవ‌రు ఏమైనా అనుకోండి.. పాతాళంలోకి తొక్కేసేలా తిట్టాల‌న్నా.. ఆకాశానికి ఎత్తేసేలా పొగ‌డాల‌న్నా కేసీఆర్‌కు మాత్ర‌మే సాధ్యం. స‌మూహంలో వీళ్లంతా వేరురా భ‌య్ అనట‌మే కాదు.. వారి మీద వేసిన ముద్ర‌తో తాను కోరుకున్న రాజ‌కీయ ప్ర‌యోజ‌నాన్ని సొంతం చేసుకున్న స‌త్తా కేసీఆర్ సొంతం. నిజానికి కేసీఆర్ కానీ సెటిల‌ర్లు అన్న మాట‌ను అదే ప‌నిగా వాడ‌కుంటే.. ఈ రోజున తెలంగాణ‌లో ఆంధ్రోళ్లు అన్న మాట త‌క్కువ‌గా వినిపించేది.

ఆ మాట‌కు వ‌స్తే... ఆంధ్రోళ్లు అన్న మాట‌తో సెంటిమెంట్‌ను ర‌గిల్చి.. వారిని తిట్టిపోయ‌టం ద్వారా.. వారి మీద ఆగ్ర‌హాన్ని పెంచ‌టంలో కేసీఆర్ రోల్ ను చ‌రిత్ర మ‌ర్చిపోదు. అదేమ‌న్నా అంటే.. తాను అనేది ఆంధ్రోళ్ల‌ను కాద‌ని.. ఆంధ్రా ప్రాంతానికి చెందిన నేత‌లను అని స‌ర్ది చెబుతుంటారు. త‌మ‌ను తాము తెలివైనోళ్ల‌మ‌ని ఫీల‌య్యే ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు కేసీఆర్ మాట‌ల‌కు మురిసిపోయి మోస‌పోతుంటారు. కొంద‌రు ఆయ‌న మాట‌ల్లో రిథ‌మ్ చూసి ప‌డిపోతే.. ఇంకొంద‌రు ఎంట‌ర్‌టైన్‌మెంట్‌గా భావిస్తారు. కానీ చాలామంది మాయ‌లో పడ్డారు.

ఆ మాట‌కు వ‌స్తే.. ఈ త‌ప్పులో ఏపీ ప్ర‌జ‌ల కంటే కూడా ఏపీ నాయ‌కుల చేత‌కానిత‌న‌మే కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంది. లెక్క తేడా మాట్లాడినంత‌నే.. ఏంది భ‌య్‌.. ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడుతున్నావ్‌.. లెక్క ఇదిగో.. దాని ప్ర‌కార‌మే మాట్లాడు అని చెప్పేంత ద‌మ్ము.. ధైర్యం ఏపీ నేత‌ల‌కు లేదు. అదే స‌మ‌యంలో కేసీఆర్ మాదిరి విష‌యాల మీద అవ‌గాహ‌న కూడా త‌క్కువే.

ఎంత‌సేప‌టికి ఏపీ నేత‌లంతా త‌మ వ్యాపారాలు.. త‌మ ఆర్థిక ప్ర‌యోజ‌నాల కోణంలో రాజ‌కీయాన్ని చూడ‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు. కానీ.. కేసీఆర్ అలా కాదు. ఆయ‌న ఆర్థిక ప్ర‌యోజ‌నాల కంటే కూడా తొలుత రాజ‌కీయ ప్రయోజ‌నాల‌కు ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తారు. ఉద్య‌మ నేత కావ‌టంతో తాను కోరుకున్న వ్య‌వ‌స్థ‌లో ఏం ఉండాలి?  ఎలా ఉండాల‌న్న బ్లూ ప్రింట్ ప‌క్కాగా ఉండ‌టంతో అంతా వ్యూహం ప్ర‌కారం సాగింది. దాన్ని బ్రేక్ చేసేంత తెలివి ఏపీకి చెందిన నేత‌ల్లో లేక‌పోవ‌టంతో కేసీఆర్ ఆటలు సాగుతున్నాయి.

హైద‌రాబాద్‌లోనూ.. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆంధ్రోళ్లు.. సెటిల‌ర్ల అన్న పేరుతో రాజ‌కీయ ర‌చ్చ చేసిన కేసీఆర్‌.. ఇప్పుడు మీరు ఆంధ్రోళ్లు కాదు. తెలంగాణ వాళ్లు అని చెబుతున్నారు. ఇదే విష‌యాన్ని ఇక్క‌డ స్థిర‌ప‌డిన వేల మంది చెప్పుకున్నారు. తాము త‌మ ప్రాంతాల్ని వ‌దిలేసి ఏళ్ల‌కు ఏళ్లు అవుతుంద‌ని.. ఇప్పుడు త‌మ ఊళ్ల‌కు వెళ్లినా అక్క‌డ ఎవ‌రూ త‌మ‌ను గుర్తు ప‌ట్ట‌ర‌ని.. అలాంట‌ప్పుడు తాము తెలంగాణ కాకుండా.. ఆంధ్రా ఎందుకు అవుతామ‌న్న మాట‌కు స‌మాధానం చెప్పింది లేదు.
ఇప్పుడు తెలంగాణ‌లో ఉన్న ఆంధ్రోళ్ల‌కు.. ఆంధ్రా మూలాలు ఉన్న వారికి కేసీఆర్ కొత్త పేరు పెట్టేశారు. మోస్ట్‌ రెస్పెక్టెడ్‌ తెలంగాణ సిటిజన్స్ అంటూ కీర్తిస్తున్న ఆయ‌న మాట‌ను తెలంగాణ ప్రాంత ప్ర‌జ‌లు ఎంత‌వ‌ర‌కూ ఆమోదిస్తారో చూడాలి.

ఇంత‌కీ నిన్న మొన్న‌టి వ‌ర‌కూ.. ఆ మాట‌కు వ‌స్తే మంగ‌ళ‌వారం ప్రెస్ మీట్లోనూ ఆంధ్రోళ్లు.. ఆంధ్రోళ్లు అన్న కేసీఆర్‌.. చివ‌ర్లో మాత్రం వారికి కొత్త పేరు ఇచ్చేసి.. మోస్ట్‌ రెస్పెక్టెడ్‌ తెలంగాణ సిటిజన్స్‌హోదా ఇచ్చేశారు. ఎందుకిలా?  అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌. దీనికి కార‌ణం లేక‌పోలేదు.

ఉద్య‌మ వేళ‌లో తాను కూర‌లో క‌రివేపాకులా.. పులుసులో ముల‌క్కాయ‌లా తెలంగాణ ఆంధ్రోళ్ల‌ను వేరు చేసి రాజ‌కీయ ప్ర‌యోజ‌నాన్ని పొందింది ఆయ‌న‌కు తెలుసు. ఇప్పుడు అదే గుర్తింపు ఉంటే.. త‌న‌కు రాజ‌కీయంగా క‌ష్ట‌మ‌న్న వైనం ఆయ‌న‌కు ఇప్పుడు అర్థ‌మైంది. అందుకే.. ఆయ‌న కూర‌లో పోపు మాదిరి తెలంగాణ ఆంధ్రోళ్ల హోదాను మార్చేయాల‌న్న భావ‌న‌కు వ‌చ్చిన‌ట్లుగా క‌నిపిస్తోంది.

మ‌రి.. ముఖ్యంగా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. కాంగ్రెస్ తో క‌లిసి పొత్తు పెట్టుకోవ‌టం.. ఆ కూట‌మిలో తెలంగాణ ఉద్య‌మంలో తిరుగులేని పాత్ర‌ను పోషించిన కోదండం మాష్టారు లాంటోళ్లు చేర‌టంతో.. ఆ కూట‌మికి క‌లిగే రాజ‌కీయ ప్ర‌యోజ‌నాన్ని బ్రేక్ చేయాలంటే తెలంగాణ‌లో ఉన్న ఆంధ్రా మూలాలు ఉన్న వారి హోదాను అర్జెంట్ గా మార్చేయాలి.

ఆ వ్యూహంలో భాగ‌మే కేసీఆర్ నోటి నుంచి తాజాగా.. మోస్ట్‌ రెస్పెక్టెడ్‌ తెలంగాణ సిటిజన్స్ అన్న మాట వ‌చ్చేసింది. కేసీఆర్ తాజాగా ఇచ్చిన హోదా ఎంత‌కాలం అంటే.. ఆయ‌న రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు.. వ్యూహాలు మారే వ‌ర‌కు ప‌క్కా అని చెప్పక త‌ప్ప‌దు. మోస్ట్‌ రెస్పెక్టెడ్‌ తెలంగాణ సిటిజన్స్ అంటూ కేసీఆర్ హోదా ఇచ్చేశారు. మ‌రి.. తెలంగాణ స‌మాజం దీన్ని ఎంత‌వ‌ర‌కూ ఆమోదిస్తుంద‌న్న‌ది అస‌లు ప్ర‌శ్న‌గా చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English