తెలంగాణ నెల ఆదాయం ఎన్ని కోట్లో తెలుసా ?

తెలంగాణ నెల ఆదాయం ఎన్ని కోట్లో తెలుసా ?

తెలంగాణ ఎన్నిక‌ల ప్ర‌చారం రంజుగా సాగుతోంది. పార్టీ సీట్ల కుంప‌టి ర‌గులుతున్నా కూడా కాంగ్రెస్ ఎక్క‌డ లేని ఉత్సాహంతో ముందుకు పోతుండ‌టం ఆశ్చ‌ర్యంగా ఉంది. కేసీఆర్ అహంకారం, కాంగ్రెస్‌ హామీలు కార‌ణంగా మేము అధికారంలోకి వ‌స్తామ‌ని ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి అన్నారు. అయితే, కాంగ్రెస్ హామీల‌పై చాలా మంది ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. అస‌లు అవి తీర్చ‌డం సాధ్య‌మేనా? అని అనుమానం వ్య‌క్తం చేశారు. అయితే, అవ‌న్నీ అపోహ‌లు అని లెక్కలు చెప్పుకొచ్చారు ఉత్త‌మ్‌.

అవ‌న్నీ ఓకే గానీ ఏకకాలంలో రూ. 2 లక్షల రైతు రుణమాఫీ ఎలా ఇస్తారు. నిరుద్యోగ భృతి అంత‌మందికి ఇవ్వ‌డం సాధ్య‌మేనా? అని ఓ ఇంట‌ర్వ్యూలో ఉత్త‌మ్ కుమార్‌రెడ్డిని అడ‌గ్గా...దానికి చాక‌చ‌క్యంగా స‌మాధానం చెప్పారు ఉత్త‌మ్‌. తెలంగాణ రాష్ట్ర ఖజానాలో నిధుల కొర‌త లేదు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం నెలకు రూ. 10,500 కోట్లు అని చెప్పారు. ప‌ది లక్షల మందికి నిరుద్యోగభృతి ఇచ్చేందుకు నెలకు రూ. 3 వేల కోట్ల చొప్పున ఏడాదికి రూ. 36 వేల కోట్లు అవుతుందని ఉత్తమ్ తెలిపారు. మిగ‌తా ప‌రిపాల‌న‌కు ఇబ్బంది లేకుండా ఈ హామీ నెర‌వేర్చ‌గ‌లం అన్నారు.

మోడీ దేశాన్ని స‌ర్వ‌నాశ‌నం చేశార‌ని, మ‌ళ్లీ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని... దేశ వ్యాప్తంగా రైతులందరికీ రూ. 2 లక్షల ఏకకాల రుణమాఫీని యూపీఏ ప్రభుత్వమే అమలు చేస్తుందని తెలిపారు. ఆర్థిక నిపుణుల కమిటీ సునిశిత‌ పరిశీలన తర్వాతే తాము హామీలు ఇచ్చామ‌ని చెప్పారు. టీఆర్ఎస్ అప్పులు చేయ‌డానికి కార‌ణం ఉంది. లెక్క‌లు అడ‌గ‌డానికి కుద‌ర‌ని కార్య‌క్ర‌మాలు చేప‌ట్టి వారి జేబులు నింపుకున్నారు. టీఆర్ఎస్‌కు కాంట్రాక్టర్లు ముఖ్యం, మాకు పేద ప్రజలే ముఖ్యం అన్నారు. కాంగ్రెస్ చ‌రిత్ర చెబుతుంది పేద‌ల విష‌యంలో కాంగ్రెస్ విధాన‌మేంటో అని అన్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ‌ రాష్ట్ర బడ్జెట్ రూ. 2 లక్షల కోట్లు ఉంటుంద‌న్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English