40.... మోదీ లెక్క ఇదేనట...!?

40.... మోదీ లెక్క ఇదేనట...!?

తెలంగాణ ముందస్తు ఎన్నికలు ఇప్పుడు సర్వేల చుట్టూనే తిరుగుతున్నాయి. తమకు ఎన్ని సీట్లు వస్తాయో ఆయా పార్టీలు లెక్కలు తీస్తూంటే ఇతర పార్టీలకు ఎన్ని వస్తాయో బరిలో ఉన్న వారు లెక్కలు తీస్తున్నారు. ముఖ్యంగా ఈ పనిని అధికార పార్టీలే చేయడం విశేషం. తెలంగాణలో రెండు నెలల క్రితం అధికార తెలంగాణ రాష్ట్ర సమితి చేయించుకున్న సొంత సర్వేలో తెలంగాణ రాష్ట్ర సమితికి 70 స్ధానాలు దక్కుతాయని తేలింది.

 దీనిని అనుసరించే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాతే ముందస్తు ప్రకటనతో పాటు 105 మంది అభ్యర్ధులను కూడా ప్రకటించారు. అయితే ఆ తర్వాత రాను రాను తెలంగాణ రాష్ట్ర సమితి పరిస్థితి మారుతూ వచ్చింది. అభ్యర్ధుల ప్రకటన తర్వాత తెలంగాణ ప్రజల్లో అసంత్రప్తి బయటపడింది. అంతే కాదు....  అధికార పార్టీ అభ్యర్ధులపై కూడా తీవ్ర పార్టీలోనే తీవ్ర అసంత్రప్తి పెల్లుబికింది. చాలా చోట్ల నిరసన గళాలు వినిపించాయి.

మరోవైపు కాంగ్రెస్, తెలుగుదేశం, తెలంగాణ జన సమితి, వామపక్షాలు మహాకూటమిగా ఏర్పడడం కూడా తెలంగాణ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో ఈ సారి ఎన్నికలు అంత ఏకపక్షంగా జరగవని, ఇక్కడ మహాకూటమికి, తెలంగాణ రాష్ట్ర సమితికి మధ్య హోరాహోరీ తప్పదనే అంచనాలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ ఎన్నికలపై సర్వే చేయించినట్లు చెబుతున్నారు. ఈ సర్వేలో తెలంగాణ రాష్ట్ర సమితికి 40 సీట్లకు మించి రావని నివేదికలు వచ్చినట్లు చెబుతున్నారు.

తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులు తెలంగాణ రాష్ట్ర సమితికి అనుకూలంగా లేదని సర్వే చెప్పడంతో ప్రధాని నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. తెలంగాణలో తెలంగాణ రాష్ట్రసమితికి అధికారంలోకి వచ్చే సీట్లు రావని తేలడంతో ఈ విషయాన్ని పార్టీ తెలంగాణ నాయకులకు చెప్పి కనీసం 20 స్ధానాలు గెలుచుకుంటే తెలంగాణలో చక్రం తిప్నవచ్చునని కమలనాథులు భావిస్తున్నారు.

ఇదే విషయాన్ని హైదరాబాద్ వచ్చిన పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్థానిక నాయకులతో అన్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర సమితికి 40 కంటే ఎక్కువ స్ధానాలు రావని సర్వేలో తేలింది కాబట్టి ప్రభుత్వ ఏర్పాటులో భారతీయ జనతా పార్టీ కీలకం కానున్నదని అమిత్ షా అన్నట్లు సమాచారం.

ఇదే విషయాన్ని అమిత్ షా పార్టీ తెలంగాణ నాయకులతో అన్నట్లు చెబుతున్నారు. మొత్తానికి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట్ర సమితికి 40 స్ధానాలు మాత్రమే వస్తాయని నిర్దారించుకున్నట్లు
చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English