ఓక్క‌రోజులో రూ.67వేల కోట్లు పోగొట్టుకున్న అమెజాన్ చీఫ్‌!

 ఓక్క‌రోజులో రూ.67వేల కోట్లు పోగొట్టుకున్న అమెజాన్ చీఫ్‌!

ఒక సంప‌న్నుడు రోజులో ఎంత సంపాదించ‌గ‌ల‌డు?  అన్న ప్ర‌శ్న‌కు మీరు ఏ మాత్రం ఊహించ‌లేని ఆన్స‌రే ఉంటుంది. పోనీ.. ఒక కుబేరుడు లాంటి వ్య‌క్తికి ఒక్క‌రోజులో ఎంత న‌ష్టం వాటిల్లే ప్ర‌మాదం ఉంది? ఎంత సంప‌ద ఆవిరి అయిపోతుంది? అన్న క్వ‌శ్చ‌న్ వేస్తే.. వ‌చ్చే స‌మాధానానికి వాస్త‌వానికి అస్స‌లు సంబంధం ఉండ‌దు. మీరు అడ‌గ‌టం.. మేం చెప్ప‌లేక‌పోవ‌టం ఎందుకు?  మీరే చెప్పేయండ‌ని అనుకోవ‌ద్దు. ఎందుకంటే.. మ‌న ఊహ‌ల‌కు ఏ మాత్రం అంద‌ని విష‌యాల్ని వివ‌రంగా చెప్ప‌ట‌మే అస‌లు ఉద్దేశం. అందుకే.. ఇలా చెప్పాల్సి వ‌స్తోంది.

ఓకే.. విష‌యంలోకి వ‌స్తే.. అంద‌రికి సుప‌రిచిత‌మైన బ్రాండ్ అమెజాన్. కానీ.. దాని వ్య‌వ‌స్థాప‌కుడు ఎవ‌రంటే మాత్రం వెంట‌నే చెప్ప‌లేరు. అత‌డి పేరు జెఫ్ బెజోస్. ప్ర‌పంచ సంప‌న్నుల్లో ఒక‌డు. ల‌క్ష‌ల కోట్ల సంప‌ద అత‌డి సొంతం. అలంటి ఆయ‌న నిన్న ఒక్క‌రోజులో న‌ష్ట‌పోయిన సంప‌ద ఎంతో తెలుసా?  అక్ష‌రాల రూ.67వేల కోట్లు. అవాక్కు అయ్యారా?  

ఎందుకిలా జ‌రిగింది? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. ఆర్థిక నిపుణుల వాద‌న ప్ర‌కారం.. అమెరికా స్టాక్ మార్కెట్లు కుప్ప‌కూల‌టంతో అమెజాన్ వ్య‌వ‌స్థాప‌కుడి ఆస్తులు తీవ్ర‌మైన ప్ర‌భావానికి గురైన‌ట్లుగా చెబుతున్నారు. నిజానికి అమెజాన్ వ్య‌వ‌స్థాకుడికి మాత్ర‌మే కాదు.. అంత‌ర్జాతీయంగా టాప్ 500 మంది సంప‌న్నులు తీవ్రంగా న‌ష్ట‌పోయారు. గురువారం ఒక్క‌రోజులో వారు న‌ష్ట‌పోయిన సంప‌ద ఏకంగా రూ.7.3 ల‌క్ష‌ల కోట్లుగా అంచ‌నా వేస్తున్నారు.

ఇలాంటి ప‌రిస్థితి ఎందుకు వ‌చ్చింద‌న్న‌ది చూస్తే.. అమెరికా.. చైనాల మ‌ధ్య న‌డుస్తున్న వాణిజ్య వివాదాలు అంత‌కంత‌కూ ముదురుతున్నాయి. దీని ప్ర‌భావం ప్ర‌పంచ మార్కెట్ల మీద ప‌డ‌నుంది. శాంపిల్ గా తాజా న‌ష్టం ప్ర‌పంచ టాప్ 500 కుబేరుల‌కు ఫ‌స్ట్ తగిలింది. అమెరికా స్టాక్ మార్కెట్లు తీవ్ర ప్ర‌భావానికి లోనుకావ‌టంతో.. మ‌న సెన్సెక్స్ సైతం ప్ర‌భావిత‌మైంది.  ఏమైనా.. అమెరికా.. చైనా మ‌ద్య విభేదాల సంగ‌తేమోకానీ.. ల‌క్ష‌ల కోట్ల రూపాయిల రోజులో ఆవిరైపోవ‌టం మాత్రం అంద‌రిని క‌లిచివేస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English