ఆడకుండానే ముంబయ్‌ గెలుస్తుందా?

ఆడకుండానే ముంబయ్‌ గెలుస్తుందా?

ఐపిఎల్‌ 6 ఫైనల్‌ మ్యాచ్‌పైన నీలినీడలు వీడిపోలేదు. అసలు సండే సాయంత్రం చెన్నయ్‌ టీమ్‌ ముంబయ్‌ ఇండియన్స్‌తో ఫైనల్‌.. ఆడుతుందో లేదో తెలియదు. ఆరో సీజన్‌కు చేరిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో, ఇప్పుడు ఆడాల్సిన అవసరం లేకుండా ఫైనల్‌ విజేత ముంబయ్‌ అని చెప్పేయొచ్చు.

ఎందుకంటే ఈ మ్యాచ్‌లో చెన్నయ్‌ ఆడుతుందో లేదో తెలియదు. ఐపిఎల్‌ రూల్స్‌ ప్రకారం ఫ్రాంచైజ్‌ ఓనర్‌, సిఇఓ ఎవ్వరైనా గేమ్‌ను అవమానపరచినా, పోలీసులు అరెస్టుచేసినా, ఆ ఫ్రాంచైజ్‌ను రద్దు చేస్తారు. మరిప్పుడు ఫిక్సింగ్‌, బెట్టింగ్‌ ఆరోపణలతో అరెస్టయిన్‌ చెన్నయ్‌ టీమ్‌ సిఇఓ గురునాథ్‌ మెయిప్పన్‌ కారణంగా, ఖచ్చితంగా ఆ టీమ్‌ను రద్దు చెయ్యాల్సిందే. అలా చేస్తే ఇక ముంబయ్‌ ఆడకుండానే గెలిచినట్లు. రేపొద్దున్న చెన్నయ్‌లో బిసిసిఐ సమావేశం తరువాత ఈ విషయంపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

అయితే వినూత్నంగా చెన్నయ్‌ టీమ్‌ ఓనర్‌ ఇండియా సీమెంట్స్‌ మాత్రం, గురునాథ్‌ అస్సలు మా సిఇఓ కాదని చెప్తోంది. ఎవరెన్ని చెప్పినా గురునాథ్‌ సిఇఓ అని చెప్పడానికి ఇప్పటికే పోలీసులు దగ్గర చాలా ఆధారాలున్నాయి. అయితే గురునాథ్‌ మామగారు, బిసిసిఐ ప్రెసిడెంట్‌ శ్రీనివాసన్‌ తన అల్లుడి ఫ్యూచర్‌ను మార్చలేరుకాని, ఈ టీమ్‌ను రద్దుచేయాలా వద్దా అని మాత్రం ఆలోచిస్తున్నారట. అసలు ముందు ఈయన రిజైన్‌ చేస్తాడా లేదా అనేది కూడా పెద్ద విషయమే.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు