జ‌గ‌న్ ఇజ్జ‌త్ తీస్తున్న అంబులెన్స్ లు!

జ‌గ‌న్ ఇజ్జ‌త్ తీస్తున్న అంబులెన్స్ లు!

ఒక‌సారి జ‌రిగే అరే.. భ‌లే జ‌రిగిందే అనుకోవ‌చ్చు. రెండోసారి కూడా.. జ‌ర‌గ‌టం అంటూ యాదృశ్చికంగా స‌రిపెట్టుకోవ‌చ్చు. కానీ.. అదే ప‌నిగా ఒకే సీన్.. ప‌దే ప‌దే రిపీట్ ఎందుకు అవుతున్న‌ట్లు?  దానికి కార‌ణం ఏమిటి?  అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఇంత‌కీ దేని గురించి అంటారా?  అక్క‌డికే వ‌స్తున్నాం.

ఈ మ‌ధ్య‌న ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్రలో భాగంగా నిర్వ‌హిస్తున్న బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడుతున్న వేళ‌.. ఆటో రావ‌టం.. అందులో గ‌ర్బిణి ఉండ‌టం.. ఆ ఆటోకు దారి ఇవ్వాల‌ని జ‌గ‌న్ కోర‌టం.. అందుకు త‌గ్గ‌ట్లే స‌భ‌కు హాజ‌రైన వారు దారి ఇవ్వ‌టంతో ఆటో వెళ్లిపోవ‌టం మీడియాలో ప్ర‌ముఖంగా వ‌చ్చింది. అరే.. అంత మంది స‌భ‌లోనూ జ‌గ‌న్ దృష్టి ఆటో మీద ప‌డిందేన‌న్న పేరూ వ‌చ్చింది.

ఇదిలా ఉంటే ఆ త‌ర్వాత చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం గుర్లలో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో  అంబులెన్స్ ఒక‌టి వ‌చ్చింది.. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ మాట తూలేశాడు. త‌న స‌భ‌ల‌కు అంబులెన్స్ లు పంప‌టం ద్వారా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు దుర్మార్గంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని.. తాను 108 మీద విమ‌ర్శిస్తుంటే.. దాన్ని స‌మ‌ర్థించుకోవ‌టానికే త‌న స‌భ‌ల వ‌ద్ద‌కు అంబులెన్స్ లుపంపుతున్న‌ట్లుగా నోటికి వ‌చ్చిన‌ట్లుగా తిట్టేశారు.

అయితే.. స‌ద‌రు అంబులెన్స్ జ‌గ‌న్ పార్టీ వారి పుణ్య‌మేన‌ని.. జ‌గ‌న్ ను చూసేందుకు వ‌చ్చే క్ర‌మంలో ఆయ‌న అభిమాని ఒక‌రికి యాక్సిడెంట్ కావ‌టం.. అత‌న్ని ఆసుప‌త్రికి త‌ర‌లించే క్ర‌మంలోనే 108 స‌ర్వీసు వ‌చ్చిన‌ట్లుగా ఆ త‌ర్వాత తేలింది. అయితే.. అప్ప‌టికే అంబులెన్స్ లో ఉన్న వ్య‌క్తి గురించి.. జ‌రిగిన అస‌లు సంగ‌తి గురించి తెలీని జ‌గ‌న్‌.. త‌న‌కు బాగా అల‌వాటైన అడ్డ‌బ్యాటింగ్‌తో మైలేజ్ తెచ్చుకునే ప్ర‌య‌త్నం చేశారు. కాకుంటే.. స‌ద‌రు అంబులెన్స్ డాబుస‌రి కోసం బాబు బ్యాచ్ పంప‌లేద‌ని.. జ‌గ‌న్ పార్టీ కార్య‌క‌ర్త గాయ‌ప‌డితే అత‌డ్ని ర‌క్షించేందుకు అంబులెన్స్ వ‌చ్చింద‌న్న విష‌యం బ‌య‌ట‌కు రావ‌టంతో.. జ‌గ‌న్ తో స‌హా ఆ పార్టీ నేత‌లు అప్ప‌టి నుంచి ఆ విష‌యాన్ని ప్ర‌స్తావించ‌ట‌మే మానేశారు.

ఇదిలా ఉంటే.. తాజాగా గ‌ణ‌ప‌తిన‌గ‌రంలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ జ‌రుగుతున్న‌ప్పుడు మ‌రోసారి అంబులెన్స్ వ‌చ్చింది. ప్ర‌భుత్వ అంబులెన్స్ లు రావ‌ట్లేదు కానీ.. ప్రైవేటు అంబులెన్స్ లు వ‌స్తున్నాయ‌ని.. వాటికి దారి ఇవ్వాలంటూ జ‌గ‌న్ కోరారు. ఇక్క‌డ క‌లిగే సందేహం ఏమంటే.. జ‌గ‌న్ స‌భ జ‌రుగుతున్న‌ప్పుడు వ‌రుస పెట్టి అంబులెన్స్ లు ఎందుకు వ‌స్తున్నాయి? అన్న‌ది ఇప్పుడు క్వ‌శ్చ‌న్ గా మారింది.

జ‌గ‌న్ బ్యాచ్ కావాల‌నే అంబులెన్స్ లు ఏర్పాటు చేసిందని.. ఇమేజ్ క‌క్కుర్తితో ఇలాంటి ప‌నులు చేసింద‌న్న ద‌రిద్ర‌పు విశ్లేష‌ణ‌లు చేయ‌టం. ఇంత‌కూ జ‌గ‌న్ స‌భ‌ల్లో త‌ర‌చూ క‌నిపిస్తున్న అంబులెన్స్ లు ఎక్క‌డివి?  ఎందుకు వ‌స్తున్నాయి?  అన్న ప్ర‌శ్న‌లు వేసుకుంటే.. అస‌లు విష‌యం ఇట్టే అర్థ‌మవుతుంది. పాద‌యాత్ర‌లో భాగంగా జ‌గ‌న్ నిర్వ‌హిస్తున్న బ‌హిరంగ‌స‌భ‌లో దాదాపుగా  మాంచి సెంట‌ర్లో ఏర్పాటు చేస్తుంటారు. ఇలా చేయ‌టం ద్వారా.. జ‌న స‌మీక‌ర‌ణ‌కు ఇబ్బంది లేకుండా ఉండ‌టంతో పాటు.. ఇరుగ్గా ఉండే ప్ర‌ధాన ర‌హ‌దారులు మొత్తం జ‌నంతో నిండిపోయిన‌ట్లుగా క‌నిపించి.. అద్భుత‌మైన రెస్పాన్స్ జ‌గ‌న్ స‌భ‌ల‌కు వ‌స్తున్న‌ట్లుగా ప్ర‌చారం చేసుకోవ‌టానికి ప‌నికి వ‌స్తుంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ప్ర‌ధాన ర‌హ‌దారుల్లో జ‌గ‌న్ బ‌హిరంగ స‌భ‌లు జ‌రుగుతుండ‌టం.. అది కూడా గంట నుంచి రెండు గంట‌ల మ‌ధ్య వ‌ర‌కూ సాగ‌టంతో.. ఏదైనా అత్య‌వ‌స‌రం ఉన్నోళ్లు అంబులెన్స్ లో వెళ్లే ప‌రిస్థితి. నిజానికి స‌భ‌ల్ని ప్ర‌ధాన ర‌హ‌దారుల్లో పెట్ట‌కుంటే ఎవ‌రికి ఎలాంటి ఇబ్బంది ఉండ‌దు. కానీ.. మైలేజీ కోసం జ‌గ‌న్ క‌క్కుర్తి కార‌ణంగా అంబులెన్స్ లు అవ‌స్థ‌లు ప‌డాల్సి వ‌స్తోంది. దీన్ని త‌న రాజ‌కీయ ప్ర‌యోజ‌నం కోసం వాడేస్తున్న జ‌గ‌న్ తీరు చూస్తే.. ఏ చిన్న అవ‌కాశాన్ని వ‌దిలిపెట్టేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత ఏ మాత్రం సిద్ధంగా లేర‌న్న విష‌యం మ‌రోసారి రుజువు అయ్యింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English