అమిత్‌షా కోరిక ఏంటో బ‌య‌ట‌పెట్టేశారు

అమిత్‌షా కోరిక ఏంటో బ‌య‌ట‌పెట్టేశారు

ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర‌మోడీ న‌మ్మినబంటు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఒక‌రోజు తెలంగాణ ప‌ర్య‌ట‌న ముగిసింది. ఒకరోజు ప‌ర్య‌ట‌న‌లో భాగంగా హైదరాబాద్‌ చేరుకుని అగ్రసేన్ మహారాజ్‌కు నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగే దక్షిణ తెలంగాణ జిల్లాల పరిధిలోని పార్లమెంటు నియోజకవర్గాల బీజేపీ శక్తి కేంద్రాల ఇంఛార్జ్ లతో భేటీ అయ్యారు. ఆ తర్వతా కరీంనగర్‌లో `మార్పు కోసం బీజేపీ సమర భేరి` ఎన్నికల బహిరంగసభలో అమిత్‌షా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఒక్క చాన్స్ బీజేపీకి ఇవ్వాల‌ని అమిత్‌షా కోరారు.

కరీంనగర్‌లో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా బుధవారం మాట్లాడుతూ రాష్ట్రంలోని టీఆర్ఎస్  ప్రభుత్వం అన్ని విషయాలలోను విఫలమైందని దళిత ముఖ్యమంత్రిని చేస్తానిన చెప్పిన కేసీఆర్ దళిత కుటంబాలకు చేసిందేమి లేదని,  కేసీఆర్‌కు ఆయన కుటుంబ సభ్యులే ముఖ్యమని, 2018లో అధికారంలోకి వచ్చినా ఆయన దళితుడ్ని ముఖ్యమంత్రిని  చేయరని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి  వచ్చాక లక్ష ఉద్యోగాలు భర్తీచేస్తామని కేసీఆర్ చెప్పారని,  ఈరోజు తెలంగాణలో 2లక్షల ఉద్యోగాలు ఉన్నప్పటికీ  ప్రభుత్వం నిమ్మకు నీరెత్తిట్టు  ఉంటోందని అమిత్ షా అన్నారు. పేదలకు డబులు బెడ్ రూం ఇళ్ళు ఇస్తామని చెప్పిన కేసీఆర్  ఇంతవరకు 5 వేల  ఇళ్ల నిర్మాణం కూడా పూర్తి చేయలేక పోయారని  అన్నారు.  2019లో ఎన్నికలకు వెళితే మోడీ ధాటికి  ఓడిపోతామనే భయంతోనే ముందస్తు ఎన్నికలకు వెళ్ళి తెలంగాణ ప్రజలపై అదనపు భారం మోపారని  అమిత్ షా అన్నారు. ఎస్సీ కుటుంబాలకు ఇస్తానన్న  3 ఎకరాలు  భూమి ఇవ్వలేదని,  గత ఎన్నికల్లో  చేసిన 150వాగ్దానాల ఏమీ  పూర్తి చేయకుండానే  కేసీఆర్ మందుస్తుకు వెళ్లారని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ ని గెలిపించి  ఒక్క ఛాన్స్ఇస్తే  దేశంలో జరుగుతున్న అభివృధ్ది తెలంగాణాలోనూ  జరిగేట్టు చేస్తామని అమిత్ షా  హామీ ఇచ్చారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English