చీక‌టిప‌డితే కేసీఆర్ క‌నిపించ‌రు: బాబూ మోహ‌న్

చీక‌టిప‌డితే కేసీఆర్ క‌నిపించ‌రు: బాబూ మోహ‌న్

అందోల్ సిట్టింగ్ ఎమ్మెల్యే, కేసీఆర్ కు స‌న్నిహితుడు బాబు మోహ‌న్ కు టికెట్ ఇవ్వ‌క‌పోవ‌డంతో ఆయ‌న తీవ్ర అసంతృప్తికి గురైన సంగ‌తి తెలిసిందే. త‌న‌పై టీఆర్ ఎస్ పెద్ద‌లు వివ‌క్ష చూపుతున్నార‌ని, త‌న‌కు టికెట్ కేటాయించ‌లేద‌ని ఆరోపించిన బాబూ మోహ‌న్....కొద్ది రోజుల క్రితం బీజేపీలో చేరారు. త‌న‌కు టీఆర్ ఎస్ లో త‌గిన‌ప ప్రాధాన్య‌త ద‌క్క‌డం లేద‌ని, టికెట్ ఎందుకు ఇవ్వ‌లేదో కేసీఆర్ చెప్ప‌లేద‌ని, క‌నీసం త‌న‌ ఫోన్ కూడా లిఫ్ట్ చేయ‌లేద‌ని ఆరోపించారు. ఈ నేప‌థ్యంలో తాజాగా, కేసీఆర్ పై బాబూ మోహ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌పంచంలో సెక్ర‌టేరియ‌ట్ కు వెళ్ల‌కుండా ప‌రిపాల‌న సాగించిన ఏకైక ముఖ్య‌మంత్రి కేసీఆర్ అని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యేలు...మంత్రుల‌కు కూడా క‌న‌ప‌డ‌కుండా మ‌సుగేసుకొని ఫామ్ హౌస్ లో కూర్చున్న సీఎం కేసీఆర్ అని దుయ్య‌బ‌ట్టారు.

గ‌త నాలుగున్న‌రేళ్ల కాలంలో తెలంగాణ‌లో ప‌రిపాల‌న స‌జావుగా సాగ‌డం లేద‌ని బాబూ మోహ‌న్ అన్నారు. తాను చిన్న‌త‌నం నుంచి చాలామంది సీఎంల‌ను చూశానని, కానీ, సెక్ర‌టేరియ‌ట్ కు వెళ్ల‌కుండా పాల‌న సాగించిన సీఎం కేసీఆర్ ఒక్క‌రేన‌ని ఎద్దేవా చేశారు. ప్ర‌జ‌ల‌కు కేసీఆర్ అస‌లు క‌న‌ప‌డ‌ర‌ని, కనీసం ఎమ్మెల్యేలు...మంత్రుల‌కు క‌న‌ప‌డ‌కుండా మ‌సుగేసుకొని ప‌రిపాల‌న సాగించిన ఘ‌న‌త కేసీఆర్ దేన‌ని అన్నారు. తెలంగాణ‌లో లా అండ్ ఆర్డర్ లేద‌ని, న‌డిరోడ్డుపై ఎన్నో హ‌త్య‌లు జ‌రిగాయ‌ని... విచ్చ‌ల‌విడిగా గొడ్డ‌ళ్లు, క‌త్తుల‌తో న‌రుకుతున్నా ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటువంటివి చూసేందుకే తెలంగాణ సాధించామా అనిపిస్తోంద‌న్నారు. కొండ‌గ‌ట్టు బ‌స్సు ప్ర‌మాదం దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంద‌ని, అంత‌మంది చ‌నిపోయినా కేసీఆర్ ఘ‌ట‌నా స్థలానికి వెళ్ల‌లేద‌ని అన్నారు.

ఫార్మ్ హౌస్ కు జానెడు దూరంలో ఉన్న కొండ‌గ‌ట్టు ద‌గ్గ‌ర‌కు వెళ్లి వారిని క‌నీసం ప‌రామ‌ర్శించ‌లేద‌ని, కొండ‌గ‌ట్టు అంటే భ‌క్తి అని కేసీఆర్ అంటారని మండిపడ్డారు. ప్ర‌జ‌ల‌కు సీఎం జ‌వాబు చెప్పాలని, ఆయ‌న కోసం సామాన్యుల‌తో పాటు ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ...ప‌డిగాపులు కాశార‌ని అన్నారు. ప‌గ‌లు క‌లిసేందుకు స‌మ‌యం ఇవ్వ‌ర‌ని, చీక‌టి ప‌డ్డ త‌ర్వాత అస‌లు క‌న‌ప‌డ‌కుండా వెళ్లిపోతార‌ని చ‌మ‌త్క‌రించారు. అలా గంట‌ల కొద్దీ వేచి చూసి నిరాశ‌తో వెనుదిరిగిన ఎమ్మెల్యేలు, మంత్రుల‌ను తాను చూశాన‌ని, ...వారిలో తాను కూడా ఉన్నానని ఆయ‌న అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English