స్వామికు ఎంపీ సీటా? తెలంగాణ సీఎం క్యాండిడేటా?

స్వామికు ఎంపీ సీటా? తెలంగాణ సీఎం క్యాండిడేటా?

కాకినాడ శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానందకు బీజేపీ అధిష్ఠానం నుంచి పిలుపొచ్చింది. తెలంగాణ నుంచి ఆయనను సీఎం అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేయాలని... లేనిపక్షంలో కనీసం ఎంపీగా పోటీ చేయించాలని బీజేపీ పెద్దలు అనుకుంటున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఢిల్లీ రమ్మంటూ బీజేపీ అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది.

సోమవారం అత్యవసరంగా హస్తినకు రావాల్సిందిగా బీజేపీ చీఫ్ అమిత్ షా నుంచి పరిపూర్ణానందకు పిలుపు రావడంతో స్థానికంగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఆయన్ను హైదరాబాద్ ఎంపీ సీటుకు పోటీ చేయించి అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేయించే అవకాశం ఉందని కొందరు... సికింద్రాబాద్ నుంచి పోటీ చేయిస్తారని ఇంకో ప్రచారం సాగుతోంది.

కాగా తన రాజకీయ ప్రవేశంపై పరిపూర్ణానంద గతంలోనే ప్రకటన చేశారు. రాజకీయ రంగ ప్రవేశంపై నిర్ణయాన్ని అమ్మవారికే వదిలేశానని ప్రకటించిన ఆయన బీజేపీ, టీఆర్ఎస్‌లలో ఏది ముందు ఆహ్వానిస్తే అందులో చేరి దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తానని పేర్కొన్నారు. తాజాగా, బీజేపీ నుంచి పిలుపు రావడంతో ఆ పార్టీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

బీజేపీలో యోగి ఆదిత్యనాథ్ ప్రస్థానం చూసినవారు పరిపూర్ణానంద కూడా భవిష్యత్‌లో యోగి మాదిరిగా ఉన్నత స్థానాలు అందుకోవడం ఖాయమని అంటున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన్ను ఎంపీగానే పోటీ చేయించి గెలిపించుకుంటారని... దిల్లీలో బీజేపీ అధిష్ఠానానికి కొన్నాళ్లు దగ్గరగా పనిచేసి పూర్తిగా ఆ మార్గం పట్టాక తెలంగాణలో ఆయన్ను ముందుపెట్టి 2024లో అధికారానికి గురి పెడతారని తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English