అబ్బే వినడం లేదు..!

అబ్బే వినడం లేదు..!

ముందస్తు ఖారారైంది. అధికార తెలంగా రాష్ట్ర సమితిలో అసమ్మతి గుబులు తీరాడం లేదు. పైగా మరికొన్ని నియోజకవర్గాలకు కూడా ఇది పాకుతోంది. దీంతో తెలంగాణ రాష్ట్ర సమితి అధిష్టానం తలలు పటుకుంటోంది. ఖమ్మం జిల్ల వైరా నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్దికి వ్యతిరేకంగా పార్టీలో కొందరు పనిచేస్తున్నారు. వారిని పిలిచి మంత్రి కేటీఆర్, తుమ్మల నాగేశ్వర రావు బుజ్జగించినా ఫలితం లేదు. ఖమ్మం జిల్ల వ్యాప్తంగా ఈ అసమ్మతి వ్యాపిస్తోంది.

వరంగల్ జిల్ల స్టేషన్ ఘనాపూర్ నియోజక వర్గంలో అయితే తెలంగాణ రాష్ట్ర సమితి మూడు గ్రూపులుగా మారింది. ఇక్కడ సిట్టింగ్ అభ్యర్ది తాటికొండ రాజయ్యకు తెలంగాణ రాష్ట్ర సమితి టిక్కెట్టు కేటాయించింది. ఆయనకు టిక్కెట్టు ఇవ్వదంటూ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి వర్గీయులు ఆందోళన చేపట్టారు. వారిని హైదారబాద్ పంపించి వారితోను, కడియం శ్రీహరితోను మంత్రి కేటీఆర్ చర్చలు జరిపారు. మంత్రి సమక్షంలో చర్చలు ఫలించాయి. అయితే నియోజకవర్గానికి వెళ్లిన అనంతరం అసమ్మతి నేతలు పోరుబాట పట్టారు. వీరికి తోడు మూడో అభ్యర్ది రంగంలోకి వచ్చారు. అతనే రాజరావు ప్రతాప్. ఈయన గులాబి కండువా కప్పుకుని నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. రాజయ్యను, కడియం శ్రీహరిని కాదని తననే గెలిపించాలంటూ ప్రచారాన్ని హోరెత్తిన్తున్నారు. స్టేషన్ ఘన‌్‌పూర్ నియోజకవర్గంలో ఈ మూడు ముక్కలాట రసకంగాయంలో పడింది.

పార్లమెంటు సభ్యుడైన బాల్క సుమన్ ఈసారి చెన్నూరు శాసనసభ నియోజకవర్గం నుంచి పోటి చేస్తున్నారు. ప్రభుత్వ సలహాదారుడు జి.వినోద్‌ను లోక్‌సభకు పంపడం కోసం, బాల్క సుమన్ కోరిక మేరాకు చెన్నూరు టిక్కెట్టును ఆయనకు కేటాయించారు. అయితే ఇక్కడి సిట్టింగ్ అభ్యర్దిని మార్చడంతో కొంత వివాదమయింది. ఈ సందర్భంలో కూడా కేటీఆర్ వారిని పిలిపించి మాట్లాడారు.

ఈ సమస్య అప్పటికి పరిష్కారం అయింది. తాజాగా చెన్నూరు టిక్కెట్లు తనకు కావాలంటూ వివేక్‌ సోదారుడు, మాజీ మంత్రి జి. వినోద్ తెరపైకి వచ్చారు.  దీంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. బాల్క సుమన్‌ను గెలిపించేది లేదంటూ వినోద్ అనుచరులు శపథం చేస్తున్నారు. నాగర్‌కుర్ణూల్ జిల్ల కల్వకుర్తి టిక్కెట్లు ఆశించిన ఎమ్మెల్సీకసిరెడ్డి నార‍యణ రెడ్డి టిక్కెట్టు ఆశించారు. అయితే అధిష్టానం దాన్ని తిరస్కరించింది. దీంతో అమావాస్య తర్వాత కసిరెడ్డి వర్గీయులు పార్టీ వీడే అవకాశం ఉందంటున్నారు. గజ్వేల్ మాజీ ఎమ్మేల్యే తూంకుంట నర్సారెడ్డి కూడా పార్టీని వీడలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

ఇంకా ప్రకటించని 14 నియోజకవర్గాల అభ్యర్దులను ప్రకటిస్తే జిల్లాలకే పరిమితమైన అసమ్మతి నగరానికి పాకుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి వారు వారికి ఖర్మకు వారే పోతారని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు అన్నారు. అయితే ఎవరి ఖర్మకు ఎవరు పోతారో తామే తేలుస్తామంటూ అసమ్మతి నేతలు చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English