ల‌క్కీ నెంబ‌ర్ లేదు.. అమావాస్య వేళ పోలింగ్‌..

 ల‌క్కీ నెంబ‌ర్ లేదు.. అమావాస్య వేళ పోలింగ్‌..

పాల‌కుడికి త‌గ్గ‌ట్లు ప్ర‌జ‌లు మారిపోతుంటార‌ని చెబుతారు. ఆ విషయం స‌రి కాద‌ని చాలామంది అంటారు కానీ.. అది నిజ‌మేన‌న్న విష‌యం తాజాగా తెలంగాణ‌లో చోటు చేసుకున్న పరిణామం స్ప‌ష్టం చేసింద‌ని చెప్పాలి. అదెలానంటే.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం నిన్న ప్రెస్ మీట్ పెట్టి.. తెలంగాణ‌తో స‌హా ఐదురాష్ట్రాల ఎన్నిక‌ల షెడ్యూల్ వివ‌రాలు చెప్పినంత‌నే.. తెలంగాణ‌తో పాటు.. అటు ఆంధ్రాలోని తెలుగోళ్లు చాలామంది చేసిన ప‌ని.. క్యాలెండ‌ర్ ను చూడ‌టం. ఎన్నిక‌లకు సంబంధించి కీల‌క‌మైన పోలింగ్ తేదీతో పాటు.. ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యే రోజున ఉన్న తిథి.. న‌క్ష‌త్రాల్ని చూశారు.

ఎక్క‌డైనా.. ఎప్పుడైనా ఈసీ ఎన్నిక‌ల షెడ్యూల్ మీద ప్ర‌క‌ట‌న చూస్తే.. క్యాలెండ‌ర్ తీసి అందులో ముహుర్త బ‌లం గురించి చూడ‌టం ఎక్క‌డైనా క‌నిపించిందా?  కానీ.. తాజా ఎపిసోడ్లో మాత్రం క‌నిపిస్తుంది. ఎందుకంటే.. దానికి కార‌ణం కేసీఆరే. జాత‌కాల్ని.. జ్యోతిష్యాన్ని.. ముహుర్త బ‌లాన్ని విప‌రీతంగా విశ్వ‌సించే కేసీఆర్ కు త‌గ్గ‌ట్లే తెలుగు ప్ర‌జ‌లు చాలామంది ఎన్నిక‌ల డేట్ వ‌చ్చేసిన వెంట‌నే.. కేసీఆర్ భ‌విష్య‌త్తును డిసైడ్ చేసే పోలింగ్ తేదీ తిథిని చూశారు.
ఆశ్చ‌ర్య‌క‌రంగా పోలింగ్ జ‌రిగే డిసెంబ‌రు 7 అమావాస్య కావ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

అమావాస్య రోజున చంద్రుడి భ‌విష్య‌త్తును ప్ర‌జ‌లు డిసైడ్ చేయ‌ట‌మంటే నెగిటివ్ గా ఉంటుంద‌న్న భావ‌న ప‌లువురు వ్య‌క్తం చేశారు. ఇక‌.. ఎన్నిక‌ల షెడ్యూల్ ను ప్ర‌క‌టించిన శ‌నివారం (అక్టోబ‌రు 6) త‌ప్పించి.. ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యే రోజు వ‌ర‌కూ ఏ ముఖ్య‌మైన తేదీని మొత్తంగా క‌లిపితే.. కేసీఆర్ ల‌క్కీ నెంబ‌ర్ 6 ఎక్క‌డా రాక‌పోవ‌టం గ‌మ‌నార్హం.

అయితే.. ఈ మొత్తం ఎపిసోడ్‌లో కేసీఆర్ కు పాజిటివ్ గా ఉన్న అంశం ఒక‌టి ఉంద‌ని.. అదే కేసీఆర్ రిలీఫ్ అవ్వ‌టానికి కార‌ణ‌మ‌ని చెబుతున్నారు.

పోలింగ్ అమావాస్య రోజు జ‌రిగినా.. ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యే డిసెంబ‌రు 11 మాత్రం కేసీఆర్ కు క్షేమ‌తార అవుతుంద‌ని చెబుతున్నారు. దీంతో.. అమావాస్య రోజు పోలింగ్ జ‌రిగినా.. ఫ‌లితాలు మాత్రం కేసీఆర్ కు క్షేమ‌తార అయిన రోజున బ‌య‌టకు రానుండ‌టంతో కేసీఆర్ కు అనుకూలంగానే టైం ఉంద‌న్న అభిప్రాయాన్ని కొంద‌రు వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రి.. ఒక్క క్షేమ తార‌.. మిగిలిన అప‌శ‌కునాల్ని అధిగ‌మిస్తుందా? అన్న‌ది చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English