కేసీఆర్‌కు టెన్షన్ పెట్టాకే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ

కేసీఆర్‌కు టెన్షన్ పెట్టాకే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ

ఎన్నికల సంఘం తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు శనివారం షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణలో ఇంకా ఓటర్ల తుది జాబితా సిద్ధం కాలేదని, తుది జాబితా కోసం శుక్రవారం రాత్రి వరకూ వేచి చూశామని ఆయన చెప్పడంతో తొలుత అంతా తెలంగాణకు ఈ విడతలో షెడ్యూల్ విడుదల చేయబోరని భావించారు. అయితే, చివర్లో షెడ్యూల్ విడుదల సమయంలో ఆయన తెలంగాణకు కూడా ప్రకటించారు.

ఎన్నికలు జరగనున్న అయిదు రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్‌లో మాత్రమే రెండు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లో 18 నియోజకవర్గాలకు తొలి విడతలో పోలింగ్ నిర్వహిస్తారు. ఇవన్నీ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కావడంతో ఇక్కడ ఎన్నికల నిర్వహణకు ఎక్కువ మంది భద్రతా బలగాలు అవసరం కావడంతో మొట్టమొదట ఇక్కడ ఎన్నికలు పూర్తి చేస్తున్నారు. రెండో దశలో ఉత్తర ఛత్తీస్‌గఢ్‌లోని మిగతా 72 నియోజకవర్గాలకు పోలింగ్ ఉంటుంది. అనంతరం మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాలకు కలిపి ఒకేసారి... ఆ తరువాత రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాలకు ఒకసారి పోలింగ్ నిర్వహిస్తారు. రాజస్థాన్, తెలంగాణల్లో డిసెంబర్ 7న జరిగే పోలింగ్‌తో ఈ అయిదు రాష్ట్రాల్లో పోలింగ్ పూర్తవుతుంది. ఓట్ల లెక్కింపు డిసెంబరు 11న ఉంటుంది.

ఇదీ షెడ్యూల్:
తెలంగాణ, రాజస్థాన్(ఒకే దశలో పోలింగ్)
నోటిఫికేషన్: నవంబరు 12
నామినేషన్లు: నవంబరు 12 నుంచి 19 వరకు
ఉపసంహరణ గడువు: నవంబరు 22
పోలింగ్: డిసెంబర్ 7
----------------
మధ్యప్రదేశ్, మిజోరం (ఒకే దశలో)
నోటిఫికేషన్: నవంబరు 2
నామినేషన్లు: నవంబరు 2 నుంచి నవంబరు 9
ఉపసంహరణ గడువు: నవంబరు 14
పోలింగ్: నవంబరు 28
--------------
ఛత్తీస్‌గఢ్ (రెండు దశల్లో)
ఫేజ్-1: 18 నియోజకవర్గాలకు(దక్షిణ ఛత్తీస్‌గఢ్ - మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు)
నోటిఫికేషన్: అక్టోబరు 16
నామినేషన్లు: అక్టోబర్ 16 నుంచి 23 వరకు
ఉపసంహరణ గడువు: అక్టోబరు 26
పోలింగ్: నవంబరు 12.
ఫేజ్ 2: ఉత్తర ఛత్తీస్‌గఢ్ (72 నియోజకవర్గాలు)
నోటిఫికేషన్: అక్టోబరు 26
నామినేషన్లు: అక్టోబర్ 26 నుంచి నవంబరు 2
ఉపసంహరణ గడువు: నవంబరు 5
పోలింగ్: నవంబర్ 20.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English