కేసీఆర్ వర్సెస్ యూట్యూబ్

కేసీఆర్ వర్సెస్ యూట్యూబ్

కేసీఆర్ బహిరంగ సభ పెట్టాడంటే గ్యాప్ ఇవ్వకుండా తన శత్రువులందరినీ తిట్టిపోస్తాడు.. కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టాడంటే తాము రాష్ట్రానికి ఏమేం చేశామో ఏకరువు పెడతాడు.. ఇక మిగిలిన నేతలూ ఎక్కడికక్కడ తమ ప్రత్యర్థులపై ఎప్పటికప్పుడు  విరుచుకుపడుతూనే ఉంటుంటారు.

ఇక సొంత పత్రిక, చానల్‌లో పూర్తిగా భజనే... మిగతా పత్రికలూ కూడా ఎంతోకొంత సపోర్టే.. కానీ, కేసీఆర్ ప్రభుత్వంపై ఎందుకింత వ్యతిరేకత.. ఆ వ్యతిరేకత చూసి కేసీఆర్‌కు ఎందుకంత టెన్షన్..? విపక్షాలు ఏమైనా బలంగా ఉన్నాయా? అంటే అదీ కాదు. కేసీఆర్ బలహీనతే వారి బలం. అంతకుమించి వారి బలమూ పెద్దగా పెరిగింది లేదు. కానీ, కేసీఆర్ అంటే జనాల్లో అంత వ్యతిరేకత ఎందకొస్తోంది.. కేసీఆర్‌కు అండగా లేనిదెవరు? కేసీఆర్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నదెవరు? అంటే దానికి సమాధానం సోషల్ మీడియా. ఇంకా చెప్పాలంటే యూట్యూబ్. అవును.. యూట్యూబ్ ప్లాట్ ఫాంను ఉపయోగించుకుని కేసీఆర్ వ్యతిరేకులు చేస్తున్న ప్రచారం తెలంగాణలో హిట్టయింది.

నిజానికి సోషల్ మీడియాలో టీఆరెస్ బలంగానే ఉంది. కానీ, అది ఫేస్ బుక్ వరకే.. ట్విటర్‌లో కేటీఆర్ వంటి నేతలు తప్ప మిగతా అంతా వీకే. టీఆరెస్ సోషల్ మీడియా వింగ్స్ బలం కొంతలోకొంత ఫేస్ బుక్ వరకే. కానీ, ఉచిత డాటా కాలంలో అంతా వీడియోలపై పడుతున్నారు. ముఖ్యంగా యూట్యూబ్ జనాలకు బెస్ట్ ఫ్రెండయిపోయింది.

ఈ సంగతి కేసీఆర్, టీఆరెస్ గుర్తించడానికి ముందే వారి వ్యతిరేకులు గుర్తించారు. దాన్ని కేసీఆర్ వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లడానికి ఫుల్లుగా వాడుకున్నారు. ఇప్పుడు స్మార్టు ఫోన్ లేనివారిని వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. దీంతో ఇంటింటికీ యూట్యూబ్ వీడియోలు చేరిపోతున్నాయి. వేలకొద్దీ పుట్టుకొచ్చిన యూట్యూబ్ చానళ్లలో కేసీఆర్ వైఫల్యాలు తెలంగాణ యువత అరచేతిలో కనిపిస్తున్నాయి.

కేసీఆర్ చేసిన త‌ప్పులు, వ‌దిలేసిన హామీల లిస్టుతో యూట్యూబు నిండిపోయింది.  మిష‌న్ భ‌గీర‌థ అనుకున్న టైంకి అవ‌లేదు. విద్యార్థులు వ్య‌తిరేకంగా ఉన్నారు. నిరుద్యోగులు కోపంగా ఉన్నారు. సంఘాల మ‌ద్ద‌తు లేదు. రెండు మూడు త‌ప్ప‌ ప‌థ‌కాలన్నీ ఫెయిల్‌. ప్రాజెక్టులు చాలా పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ యూట్యూబ్ చానళ్లు ప్రధాన వనరుగా మారాయి. అదే ఇప్పుడు కేసీఆర్ కొంపముంచుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English