పొత్తు పొడవదా... !?

పొత్తు పొడవదా... !?

తెలంగాణలో ఆసక్తికర రాజకీయాలు నడుస్తున్నాయి. అధికార తెలంగాణ రాష్ట్ర సమితిని...ముఖ్యంగా కల్వకుంట్ల చంద్రశేఖర రావు అధికారాన్ని గుంజుకోవాలని ప్రతిపక్షాలు మహా కూటమిగా ఏర్పడుతున్నాయి. అయితే అందరి లక్ష్యం ఒక్కటే అయినా ఎవరికి వారే సీట్ల సర్దుబాటు దగ్గర భీష్మించుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. మహాకూటమిని నేత్రత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ అందరి కంటే తమకు ఎక్కువ స్ధానాలు కావాలని ఆశిస్తోంది.

ఇది సహజం కూడా.అయితే ఎంత ఎక్కువ అనే విషయం దగ్గరే మహాకూటమిలో కాంగ్రెస్ పార్టీకి, ఇతర పక్షాలకు పొసడగం లేదంటున్నారు. తెలంగాణలో ఉన్న 119 స్ధానాల్లో దాదాపు 95 స్ధానాలు తమకే కావాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ విషయంలో ఎలాంటి రాజీ పడొద్దని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నాయకులు అంటున్నారు.అయితే తెలుగుదేశం పార్టీ తమకు కచ్చితంగా 20 స్ధానాలు కావాలని కోరుతోంది.

దీని ప్రకారం చూస్తే ఇక మిగిలిన పార్టీలకు ఐదు నుంచి ఆరు స్ధానాలు మాత్రమే మిగులుతాయి. ఈ స్ధానాలనే సిపీఐ,తెలంగాణ జన సమితి తీసుకోవాలి. ఈ మధ్యనే పుట్టిన తెలంగాణ జన సమితికి రెండు లేదా మూడు స్ధానాలు మాత్రమే ఇవ్వాలన్నది కాంగ్రెస్ పార్టీ నాయకుల యోచన. ఇక సిపిఐకి తెలంగాణలో ఏమంత బలం లేదు కాబట్టి వారికి మరో రెండు స్ధానాలు కేటాయించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.

అయితే కాంగ్రెస్ పార్టీ ఆలోచనలకు పూర్తి విరుద్ధంగా ఆలోచిస్తున్నాయి తెలంగాణ జన సమితి, సిపిఐ పార్టీలు. తెలంగాణ జన సమతికి ముఖ్యంగా ప్రొఫెసర్ కోదండరాంకు తెలంగాణలో మంచి పేరుందని, ఆయన పట్ల యువత, మేథావుల్లో మంచి అభిప్రాయం ఉందనే వార్తలు వస్తున్నాయి. దీనిని అనుసరించి తెలంగాణజన సమితికి కచ్చితంగా 10 సీట్లకు తక్కువ కాకుండా ఇవ్వాలని కోరుతున్నారు. అలా కాకుండా రెండు,మూడు స్ధానాలకే పరిమితం చేస్తే మాత్రం తాము కూటమి నుంచి తప్పుకోవడానికైనా సిద్ధమని తెలంగాణ జన సమితి నాయకులు అంటున్నారట.

ఇక సిపిఐ పార్టీకి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో పట్టు ఉంది. ఆ రెండు జిల్లాలతో పాటు రంగారెడ్డి,మెదక్ జిల్లాల్లో కూడా క్యాడర్ ఉన్నారంటున్నారు. దీనిని ద్రష్టిలో ఉంచుకుని తమకు కనీసం పది స్ధానాల కావాలని వారు కోరుతున్నారు. మహా కూటమి నాయకులు రెండు రోజులకొకసారి కలుస్తున్నా పొత్తుల దగ్గర మాత్రం ఏకాభిప్రాయం రావడం లేదని సమాచారం. ఇలా నాన్చుతూపోతే రానున్న రోజుల్లో మరిన్ని ఇక్కట్లు తప్పవని అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English