కేసీఆర్ కు సిగ్గుందా?: బాబు

కేసీఆర్ కు సిగ్గుందా?: బాబు

ఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణ ఆప‌ద్ధ‌ర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగ‌తి తెలిసిందే. త‌మ అధినేత‌పై పొరుగు రాష్ట్ర ఆప‌ద్ధ‌ర్మ సీఎం చేసిన అవ‌మాన‌క‌ర వ్యాఖ్య‌ల‌పై టీడీపీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు.

తాను చేసిన వ్యాఖ్య‌ల‌కు కేసీఆర్ వెంటనే బేష‌ర‌తుగా క్షమాపణ చెప్పాలని ప‌లువురు టీడీపీ నేత‌లు డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబుపై కేసీఆర్ వాడిన భాష అసహ్యం కలిగిస్తోందని ప‌లువురు విమర్శించారు. ఈ నేప‌థ్యంలో తాజాగా, కేసీఆర్ పై ఏపీ మంత్రి నక్కా ఆనందబాబు నిప్పులు చెరిగారు. కేసీఆర్ లాంటి నీచుడు రాజకీయాల్లో ఉండరని ఆనంద‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేసీఆర్ కు సిగ్గు ఉందా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

తెలంగాణ ఇవ్వ‌క ముందు కేసీఆర్ కుటుంబం.....సోనియాగాంధీ కాళ్లు నాకింద‌ని షాకింగ్ కామెంట్స్ చేశారు. 'పోటుగాడు తన్నుకోవడానికి వస్తాడా? రమ్మనండి చూసుకుందాంస  అని కేసీఆర్ కు ఆనంద‌బాబు సవాల్ విసిరారు. తెలంగాణ యువతను ఊచకోత కోశార‌ని కేసీఆర్ త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని మండి ప‌డ్డారు.

అటువంట‌పుడు 2009లో చంద్రబాబుతో కేసీఆర్ పొత్తు ఎందుకు పెట్టుకున్నారని ప్ర‌శ్నించారు. కేసీఆర్ వి దొంగ దీక్షల‌ని, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనేన‌ని అన్నారు. హైదరాబాద్ కేసీఆర్ అబ్బ సొత్తు కాదని... పదేళ్ల పాటు హైద‌రాబాద్ పై ఏపీకి కూడా హక్కుందని తెలిపారు. కేసీఆర్ పాల‌న‌పై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంద‌ని, దానిని కప్పిపుచ్చుకునేందుకే టీడీపీ, చంద్ర‌బాబుల‌పై కేసీఆర్ విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఇక‌నైనా చంద్ర‌బాబును విమ‌ర్శించ‌డం మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English