కేసీఆర్‌కు షాకిచ్చేలా.. సీ ఓట‌ర్ స‌ర్వే!

కేసీఆర్‌కు షాకిచ్చేలా.. సీ ఓట‌ర్ స‌ర్వే!

ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు సంబంధించి తెలంగాణ ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆత్మ‌విశ్వాసం చూస్తే.. ఎవ‌రికైనా ముచ్చ‌ట వేయాల్సిందే. తాను న‌మ్మిందే వేదం అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న కేసీఆర్‌.. ఇప్ప‌టివ‌ర‌కూ వంద సీట్లు త‌మ ఖాతాలో ప‌డ‌తాయ‌న్న మాట‌కు అద‌నంగా మ‌రో ప‌ది సీట్ల‌ను క‌లిపి మొత్తం 110 సీట్లు గెలుచుకుంటామ‌న్న ధీమాను గురువారం రాత్రి జ‌రిగిన స‌భ‌లో వెల్ల‌డించారు.

అసెంబ్లీలో మొత్తం 119 సీట్ల‌కు త‌న స్నేహితుడు మ‌జ్లిస్ తో క‌లిసి మొత్తంగా 117 సీట్లు త‌మ‌వేన‌ని చెప్పి సంచ‌ల‌నం సృష్టిస్తున్నారు. ఇదిలా ఉంటే.. కేసీఆర్ నోటి నుంచి 110 సీట్ల మాట వ‌చ్చిన కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే సీ ఓట‌ర్ స‌ర్వే ఒక‌టి విడుద‌లైంది. తెలంగాణ‌లో ఇప్ప‌టికిప్పుడు లోక్ స‌భ ఎన్నిక‌ల్ని నిర్వ‌హిస్తే ఏం జ‌రుగుతుంద‌న్న అంశంపై స‌ర్వే నిర్వ‌హించారు. దీనికి సంబంధించిన వివ‌రాలు విడుద‌లై షాకింగ్ గా మారాయి.

ఓప‌క్క త‌న‌కు తిరుగులేద‌ని చెప్పుకుంటున్న కేసీఆర్ మాట‌ల్లో ప‌స లేద‌ని.. ఆ పార్టీకి చెందిన ఎంపీ సీట్లు చేజార‌నున్న‌ట్లుగా వెల్ల‌డించారు. ఇప్ప‌టికిప్పుడు తెలంగాణ‌లో లోక్ స‌భ ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే.. టీఆర్ఎస్‌కు 9.. కాంగ్రెస్ కు ఆరు.. మ‌జ్లిస్‌.. బీజేపీల‌కు చెరో సీటు ద‌క్కుతుంద‌ని చెబుతున్నారు.

గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ రెండు ఎంపీ స్థానాల్లో విజ‌యం సాధించ‌గా.. తాజాగా టీడీపీతో ఆ పార్టీ పొత్తు పెట్టుకోవ‌టం కార‌ణంగా లాభ‌ప‌డుతుంద‌ని చెబుతున్నారు. ఈ కార‌ణంతోనే రెండు సీట్లు కాస్తా ఆరు సీట్లు పెరుగుతాయ‌ని చెప్పింది. ఇదిలా ఉంటే మ‌జ్లిస్ కు 2014తో పోలిస్తే ఈసారి 22 శాతం ఓట్లు అధికంగా వ‌స్తాయ‌ని.. అయితే.. ఆ పార్టీ మాత్రం ఒక్క సీటుకే ప‌రిమితం అవుతుంద‌ని స‌ర్వే వెల్ల‌డించింది. మొత్తంగా క్లీన్ స్వీప్ చేస్తామ‌ని కోత‌లు కోసే కేసీఆర్ సారు సీ ఓట‌ర్ స‌ర్వేను చూస్తే బాగుంటుందేమో!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English