ఏపీలో ఐటి డేగ‌ కన్ను !

ఏపీలో ఐటి డేగ‌ కన్ను !

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడిని ఇబ్బందుల పాలు చేసే ప్రక్రియకు భారతీయ జనతా పార్టీ రంగం సిద్దం చేస్తోంది. ఇప్పటికే తెలంగాణలో చంద్రబాబు ప్రధాన అనుచరుడు రేవంత్ రెడ్డిపై ఐటి దాడులు చేసిన కేంద్రం ఇప్పుడు తమ దృష్టిని ఆంధ్రప్రదేశ్ వైపు మళ్లించినట్లు తెలుస్తోంది. ఆదాయ పన్ను శాఖ అధికారులు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖులపై ఓ కన్నేసి నట్టు సమాచారం. ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన నాయకులు, తెలుగుదేశానికి సన్నిహితంగా ఉన్న పారిశ్రామికవేత్తలపై కన్నేసి నట్లు సమాచారం.

స్ధానిక ఆదాయ పన్ను అధికారుల సహాయంతో ఇప్పటికే ఓ జాబితాను రూపొందించినట్లు చెబుతున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విశాఖపట్నం, నెల్లూరు, క్రిష్ణ, గుంటూరు జిల్లాలలో ఐటి శాఖ దాడులు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి సంబంధించిన ఆస్తులు, వ్యాపారాలపై  లెక్కలు తీస్తున్నారని భోగట్ట.

చంద్రబాబు నాయడి భార్య భువనేశ్వరి, కోడలు బ్రహ్మణి ఆధ్వర్యంలో నడుస్తున్న హెరిటేజ్ సంస్థ నిర్వాహణపైన కూడా ఐటి అధికారులు సమాచారాన్ని సేక‌రించినట్లు చెబుతున్నారు. మంత్రులు నారా‍యణ, గంటా శ్రీనివాస్, రాజ్యసభ సభ్యులు సిఎం. రమేష్, కేంద్ర మాజీ మంత్రి సుజాన చౌదరి వంటి వారిపై నిఘా పెట్టినట్టు సమాచారం. పలువురి ఇళ్లలో సోదాలు, తనిఖీలు జరిగినప్పుడు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండేందుకు స్ధానిక పోలీసుల సాయం కూడా కోరినట్లు చెబుతున్నారు.

మరోవైపు ఐటి విభాగంలో తనకున్న పరిచయాలతో  ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు స‌మాచారం అందుతోంది. ఐటి దాడులలో ఏమి దొరకకపోయిన తెలుగుదేశం నాయకుల్ని, బాబు సన్నిహితులను భయభ్రాంతులు చేసేందుకు ఐటి దాడుల వ్యూహం పన్నినట్లు చెబుతున్నారు.

సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు కూడా జరుగుతాయి కాబట్టి  ఈలోగా తెలుగుదేశం పార్టీని అన్ని విధాలుగా నిర్వీర్యం చేయాలన్నది కమలనాథుల ఎత్తుగడగా చెబుతున్నారు. గడచిన రెండు మూడు నెలలుగా క్రిష్ణ, గుంటూరు జిల్లాలపై ఐటి శాఖ కన్నేసింది. రాజధాని అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ దందా చేసిన వారి జాబితాను రూపొందించిందని సమాచారం.  ఈ జాబితాలో ఉన్న వారందరి ఇళ్లపై పకడ్బందిగా దాడులు చేయాలని ఐటి శాఖ నిర్ణయించినట్లు చెబుతున్నారు.

కొస‌మెరుపు - ఈ ఐటీ దాడులు తెలంగాణ‌లో ప్ర‌తిప‌క్ష నేత‌ల‌పై, ఆంధ్రాలో అధికార ప‌క్ష నేత‌ల‌పై జ‌రుగుతుంటే... వీటి వెనుక ఉద్దేశం ఏమిటో చిన్నా పిల్లాడికి కూడా అర్థ‌మ‌వుతోంది. నోట్ల ర‌ద్దు స‌మ‌యంలో కోట్ల క‌ట్ట‌లు చేతులు మారినపుడు ఏ దాడులూ చేయ‌ని అధికారులు ఇపుడు హ‌డావుడి చేయ‌డంలో ఆంత‌ర్యం ఏమిటో అని సోష‌ల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English